టాలీవుడ్ ఇంట్రెస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఉన్నవారిలో నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఉంటారని చెప్పవచ్చు. ఈ నలుగురు ఒకే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేశారు. పాపులారిటీ, బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఈ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఎప్పుడూ నెలకొంటూ ఉండేది. ఆ సమయంలో “మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప” అనుకుంటూ ఫ్యాన్స్ వార్స్ కూడా జరుగుతూ ఉండేది. అయితే ఈ హీరోల మధ్య మాత్రం ఎప్పుడూ శత్రుత్వం ఉండేది కాదు. దేనితో సంబంధం లేకుండా వీరు నలుగురు కలిసి మెలిసి ఉండేవారు.
ముఖ్యంగా నాగార్జున, చిరంజీవి మొదటినుంచీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా మెలుగుతారు. ఇతర హీరోలతో చిరంజీవికి విభేదాలు వచ్చినా నాగార్జునతో ఎన్నడూ రాలేదు. ఒకరికొకరు బహిరంగంగానే మద్దతు ఇచ్చుకుంటారు. అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు తీశాడు. కృష్ణ, హరికృష్ణ, శ్రీకాంత్ వంటి హీరోలతో కలిసి నాగ్ మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. అయితే చిరంజీవితో మాత్రం ఎప్పుడూ అతడు జతకట్టి మూవీ తెరకెక్కించలేదు. కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా తన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా వెంటనే కే రాఘవేంద్రరావుని కలిశాడు. మంచి కథ వినిపించడంతో నాగార్జునతో పాటు చిరంజీవి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇందులో అప్పటి సహజ నటి సౌందర్యాన్ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆపై చాలా వేగంగా రెండు పాటలు షూట్ చేసేసి, 10 శాతానికి పైగా టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. అప్పుడే రాఘవేంద్రరావుకి ఈ సినిమా కథ చిరంజీవికి తగినది కాదనే విషయం బోధపడింది. ఈ మూవీ వర్కౌట్ కాదని, బాక్సాఫీస్ వద్ద ఫేలవుతుందని కూడా ఆయన నాగార్జునకి చెప్పారట.
ఆ సంగతి విని “సినిమాపై నమ్మకం లేకపోతే ఆపేయడం మంచిది” అని కింగ్ నాగార్జున అభిప్రాయపడ్డాడట. చిరు కూడా నాగార్జున అభిప్రాయంతో అంగీకరించగా ఈ మూవీ ఆగిపోయిందని అంటారు. ఈ సినిమా కోసం చిరు 30 రోజులు డేట్స్ ఇచ్చాడు. అవన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. అయినా నాగార్జునపై కొంచెం కూడా కోప్పడకుండా చిరంజీవి చాలా కూల్ గా దీన్ని తీసుకున్నాడని టాక్. మళ్లీ మంచి కథతో సినిమా తీయాలని రాఘవేంద్రరావుకి నాగార్జున అని చెప్పారు కానీ అది జరగనే లేదు.