తెలుగు సినిమా చరిత్రలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఈ రెండు ఫ్యామిలీలు టాలీవుడ్ లో తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఈ రెండు వంశాల నుంచి మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి సినిమా రంగంలో సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి వంశంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. అటు అక్కినేని వంశంలో నాగచైతన్య, అఖిల్ మూడోతరం హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ వారసులుగా బాలకృష్ణ, నాగార్జున ఇద్దరు సీనియర్ హీరోలుగా తమ దైన ముద్ర వేస్తున్నారు.
ఎన్టీఆర్ – ఏఎన్నార్ కలిసి ఎన్నో మల్టీ స్టార్ సినిమాలలో నటించారు. వీరిద్దరూ కలిసి అప్పట్లో సినిమా చేస్తున్నారు అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్ద పండగ. అయితే వీరిద్దరి వారసులు కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించలేదు. అయితే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని ఈ ఇద్దరు హీరోల కేరీర్ ప్రారంభంలో ప్లాన్ చేశారు. ఈ సినిమాకు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ లేదా మరో బ్యానర్లో తెరకెక్కించాలని రాఘవేంద్రరావు అనుకున్నారు కూడా..!
మెయిన్ లైన్ అనుకున్నారు. బాలకృష్ణ, నాగార్జున ఇద్దరు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు. ఆ తర్వాత ఏడాదిలోనే నాగార్జున, బాలకృష్ణ ఇమేజ్లు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. దీంతో రాఘవేంద్రరావు ముందుగా చెప్పిన కథలో నటించేందుకు వీరు ఒప్పుకోలేదు. అలా నాగార్జున – బాలకృష్ణ మల్టీ స్టార్లర్ సినిమా మిస్సయింది.
కారణాలు ఏవైనా ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోల మధ్య అంత సఖ్యత వాతావరణం అయితే లేదు. ఇప్పటికే వీరిద్దరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా లేదు. ఇక భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా వస్తుందని ఊహించడం కూడా అత్యాశ అవుతుంది. అయితే ఈ వంశాల్లో మూడోతరం హీరోలైన ఎన్టీఆర్, అఖిల్, నాగచైతన్య మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అక్కినేని – నందమూరి వంశంలో ఇప్పుడు మూడోతరం హీరోల నుంచి అయినా మల్టీస్టారర్ సినిమాలు వస్తాయేమో చూడాలి.