ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా పెళ్లైన సంవత్సరానికి విడాకులు తీసుకుంటూ ఉండడం ..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఏలేసిన నాగబాబు .. ఇప్పుడు జనసేన పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన మాట్లాడుతూ నేటి కాలం జనరేషన్ ఎందుకు విడాకులు తీసుకుంటుంది అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఒకప్పటి జనరేషన్ లో చాలా అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజ్ లు అవ్వడం లాంటివి ఉండేటివి . కానీ ఇప్పుడు అలాంటివి లేవు. ఎక్కడ చూసినా బ్రేకప్లే కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా నేటి జనరేషన్ అమ్మాయిల అబ్బాయిల మైండ్ సెట్ . అబ్బాయిలు ఒక మైండ్ సెట్ నుంచి పూర్తిగా డెవలప్ అవ్వలేదు .. ఆడపిల్లలేమో చిన్నప్పటినుంచి పెద్ద వారిని చూసి మీరు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు .. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనే ప్రశ్నలు తిరిగి వేస్తున్నారు .
భార్యాభర్తలు ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నప్పుడు లేదా భర్త కంటే భార్య మరింత రేంజ్ లో సంపాదిస్తున్నప్పుడు ..నేనెందుకు సర్దుకుపోవాలి అన్న ప్రశ్న ఎక్కువగా వస్తుంది . అలా భర్తలు భార్యలను కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పుడే ఇలాంటి బ్రేకప్ లు ఎక్కువగా జరుగుతున్నాయి అంటూ సంచలన కామెంట్స్ చేశారు . అయితే ఇది తన కూతురు విషయంలో జరిగిందేమో అందుకే ఇంత కరెక్ట్ గా చెప్పాడు నాగబాబు అంటూ పలువురు నిహారిక డివర్స్ ని లాగుతున్నారు. మరికొందరు శ్రీజ విషయంలో జరిగిందేంది అంటూ నాగబాబును ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి విడాకులపై ఇలాంటి కామెంట్స్ చేసి నాగబాబు భళే ఇరుక్కున్నాడు..!!