మురళీ శర్మ టాలీవుడ్‌లో మోస్ట్ వర్సటైల్, బిజీగా ఉన్న నటులలో ఒకరు. అతను సహాయక పాత్రలతో తన కెరీర్ ప్రారంభించాడు, కానీ తరువాత ఎలాంటి కష్టమైనా రోల్ అయినా చేయడం ప్రారంభించాడు. వైవిధ్యమైన పాత్రలు, ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్రలు చేయడంలో తన ప్రతిభను చాటుకున్నాడు. తను తన సహజమైన నటనతో చాలా ప్రశంసలు పొందాడు. ఇండస్ట్రీలో ఒకప్పుడు చంద్రమోహన్ వంటి నటులు తండ్రి క్యారెక్టర్లు చేస్తూ బాగా అలరించేవారు. అలాంటి నటులు లేని లోటును మురళీ శర్మ భర్తీ చేశాడు.
మురళీ శర్మది తెలుగు నేపథ్యం. ఇతను పుట్టింది ఆంధ్ర ప్రదేశ్, అయితే తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం వేరే రాష్ట్రాలకు వెళ్లింది. అదే సమయంలో మురళీ శర్మ హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ వంటి ఇతర భాషలలో కూడా నటించాడు. అయితే, అతను తెలుగు సినిమాలో అత్యంత పాపులర్ అయి యాక్టివ్‌గా తెలుగు సినిమాల్లోనే నటిస్తున్నాడు.
అతని వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. అతను మరో నటి అశ్విని కాలశేఖర్/ కల్సేకర్‌ని వివాహం చేసుకున్నాడు. అశ్విని హిందీ టెలివిజన్, చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. CID వంటి అనేక సీరియల్స్‌లో కనిపించింది, ఇది తెలుగులోకి కూడా డబ్ అయింది. ఆమె బద్రీనాథ్, నిప్పు, మెహబూబా వంటి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. అశ్విని బద్రీనాథ్‌లో తమన్నాకు అక్కగా, నిప్పులో కెల్లీ దోర్జీ భార్యగా నటించింది.
మురళీ శర్మతో అశ్విని కాలశేఖర్ ది సెకండ్ మ్యారేజ్. ఆమె గతంలో మరో నటుడు నితీష్ పాండేని వివాహం చేసుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె ఒక టీవీ షో సెట్స్‌లో మురళీ శర్మను కలుసుకుంది. ఆపై వారు ప్రేమలో పడ్డారు. 2009లో పెళ్లి చేసుకుని అప్పటి నుంచి సంతోషంగా జీవిస్తున్నారు. అయితే వీరికి ఎంతమంది పిల్లలు అసలు పిల్లల్ని కన్నారా లేదా అనేది తెలియ రాలేదు. ఏది ఏమైనా వారు దాదాపు 15 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరికివారు సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నారు.