వాట్ మృణాల్ ఠాకూర్ తెలుగింటి కోడలు కాబోతుందా..? ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైమా అవార్డ్స్ లో మాట్లాడుతూ “హీరోయిన్ లావణ్య త్రిపాఠి కు నేను సజెషన్ ఇచ్చానని .. ఆ అమ్మాయి అది బాగా ఫాలో అయింది అని.. హైదరాబాద్ కుర్రాడిని చూసి సెటిలైపోయి.. పెళ్లి చేసుకో అంటూ సజెషన్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు . మరికొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి తెలుగింటి కోడలు కాబోతుందని.. ఇప్పుడు నిన్ను అదే విధంగా బ్లెస్ చేస్తున్నాను.. త్వరగా హైదరాబాద్ అబ్బాయిని చూసుకొని ఇక్కడకు వచ్చి తెలుగింటి కోడలుగా సెటిల్ అయిపో” అంటూ ఆశీర్వదించారు.
ఈ ఆశీర్వాదం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే అల్లు అరవింద్ మామూలోడు కాదు . అసలు విషయం లేనిదే కొసరు మ్యాటర్ ముందుకు తీసుకెళ్లడు. అతగాడికి మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ప్రతి విషయం తెలుసు . ఆ కారణంగానే మృణాల్ ఠాకూర్ ని అలా ఆశీర్వదించారు . మృణాల్ సైతం ఆయన ఆశీర్వాదాలను స్వీకరించింది . ఈ విధంగా చూసుకుంటే మృణాల్ ఠాకూర్ తెలుగు హీరోతో ప్రేమాయణం నడుపుతుంది అని గత కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమే అని నమ్మక తప్పడం లేదు.
అంతేకాదు అతడు స్టార్ హీరో కొడుకు కావడం ఇక్కడ గమనార్హం. ఇప్పటివరకు వాళ్ళిద్దరూ కలిసి ఒక్క సినిమాలో నటించకపోయినా .. పార్టీలు – పబ్బులు అంటూ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు . ఈ విషయం ఆ స్టార్ హీరోకి తెలిసినా కూడా సైలెంట్ గా ఉన్నాడు . కుర్రాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అనుకున్నాడొ.. లేకపోతే వాళ్ళ మధ్య అలాంటిది లేదులే అని అనుకున్నాడో తెలియదు కానీ ..మేటర్ అయితే చాలా దూరం వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అల్లు అరవింద్ పసిగట్టిన ఆ మ్యాటర్ ని తన సొంత తండ్రి కనిపెట్ట లేకపోవడం విడ్డూరంగా ఉంది అంటున్నారు జనాలు..!!