Newsనాన్న‌తో సినిమా... చిరు కూతురు సుస్మిత‌కు అప్పుడే కోటి బొక్క‌...!

నాన్న‌తో సినిమా… చిరు కూతురు సుస్మిత‌కు అప్పుడే కోటి బొక్క‌…!

సినిమా వాళ్ళ పనులు సినిమాలు పట్టాలు ఎక్కే వరకు అనుమానంగానే సాగుతూ ఉంటాయి. సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కినా.. పట్టాలు ఎక్కకపోయినా ప్రారంభ ఖర్చులు తప్పవు. వాటికి వడ్డీలు తప్పువు. సినిమా ఓకే అయ్యి ప్రారంభోత్సవం జరుపుకొని షూటింగ్ అయ్యి విడుదలకు రెడీ అయితే ఇవన్నీ ప్రొడక్షన్ కాస్ట్ కిందుకు వస్తాయి. లేకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మెగాస్టార్ పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత తన తండ్రితో సినిమా తీయాలని అనుకున్నారు.

చిరంజీవి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద రిస్క్ వద్దని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ కూడా స్థాపించారు. తండ్రితో సినిమా కోసం మంచి రచయితను చూసుకున్నారు. కథ విన్నారు ఓకే అనుకున్నారు. అయితే ఆ కథకు వేరే వాళ్ళతో లింక్ ఉండడంతో అవన్నీ వదిలించుకున్నారు. వేరే డైరెక్టర్ తో లింక్ ఉండడంతో అవన్నీ సెట్ చేసుకున్నారు.

ఆఖరికి కురసాల కళ్యాణ కృష్ణను డైరెక్టర్గా తీసుకున్నారు. ఇంతలోనే కథ‌ అడ్డం తిరిగింది. చిరంజీవి నటించిన భోళా శంకర్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి టైంలో సొంతంగా సినిమా తీస్తే మార్కెట్ ఎలా ? ఉంటుందో తెలియదు. దీంతో ప్రాజెక్ట్ మొత్తం పక్కన పెట్టేశారు చిరంజీవి. యూవీ సంస్థతో ఓ భారీ సినిమాకు ఓకే చెప్పారు. అయితే ఇంతలోనే చిరంజీవి కుమార్తె సినిమా కోసం పెట్టిన ప్లానింగ్ ఖర్చు కోటి రూపాయలుగా తేలిందట.

ఈ కోటి రూపాయలలో ఎక్కువ భాగం ఆ సినిమాకు కథ పట్టుకు వచ్చిన రచయితకు ఉన్న బంధాలు సెటిల్ చేయడానికి అయినట్టు తెలుస్తోంది. దీంతో సుస్మిత కాస్త ఆగ్రహంగానే ఆ రచయితను వెనక్కి పంపేసి ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పడేసారని తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి చిరంజీవి యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమా పూర్తయ్యాకకే సుస్మిత బ్యానర్లో చిరంజీవి సినిమా ఉంటుంది.. లేకపోతే లేకపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయితే చిరంజీవి కుమార్తెకు మాత్రం కోటి రూపాయల చేతి చమురు వదిలిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news