మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు పరిచయం అక్కర్లేదు.. మెగా డాటర్ గా ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. శ్రీజ 2007లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఢిల్లీలో కాపురం పెట్టిన ఈ జంట ఓ కూతురు పుట్టిన కొద్ది రోజులకే మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ తన తండ్రి చిరంజీవి వద్దకు వచ్చేసింది.
చిరు ఇంట్లోనే చాలా ఏళ్లపాటు ఉంది. ఆ తర్వాత చిరంజీవి చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్కి ఇచ్చి మళ్లీ పెళ్లి చేశారు. ఈ దంపతులకు కూడా ఒక కూతురు ఉంది. అయితే శ్రీజ – కళ్యాణ్ దేవ్ మధ్య కొద్ది రోజులకే మనస్పర్ధలు రావడంతో వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. దీంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారని వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ శ్రీజ, కళ్యాణ్ వేరువేరుగా ఉంటున్నది మాత్రం వాస్తవం.
శ్రీజ కొన్నాళ్లుగా తన ఇద్దరు కూతుర్లతో కలిసి మళ్ళీ చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో జిమ్ ట్రైనర్ టెక్నిక్స్ చెప్తుంటే శ్రీజ తెగ వర్కౌట్లు చేస్తూ కష్టపడి పోతుంది. జిమ్ ట్రైనర్ మినాష్ గాబ్రియల్- శ్రీజ కలిసి చేసిన ఓ వర్కౌట్ తో వీడియో ఎండ్ అయింది.
శ్రీజ ఈ వర్కౌట్లు చేసేందుకు బాగా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అరిచేతుల మీద పైకి కిందకు లెగుస్తూ వర్కౌట్ కోసం చెమటలు కక్కుతోంది. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే మొగుడిని వదిలేసి ఇలాంటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ఎందుకు పాపులారిటీ పెంచుకుంటున్నావు అని దారుణంగా కూడా కామెంట్ చేస్తున్నారు.