Moviesదసర పండుగ వైబ్స్: క్లిం కార ఫోటో రివిల్..ఎంత క్యూట్ గా...

దసర పండుగ వైబ్స్: క్లిం కార ఫోటో రివిల్..ఎంత క్యూట్ గా ఉందో..చూశారా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి రీసెంట్ గానే ఓ పాప జన్మించింది . పెళ్లి తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకొని మొదటి సంతానాన్ని ప్లాన్ చేసుకోవడంతో వీళ్ళ ఫస్ట్ బేబీకి సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతుంది.

ఉపాసన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి ఏ ఫుడ్ తీసుకుంటుంది..? ఎక్కడికి వెళ్తుంది ..? ఎలా ఉంటుంది..? అని అన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఇప్పటివరకు క్లిం కార ఫోటోను సోషల్ మీడియాకి రిలీజ్ చేయలేదు ఈ దంపతులు. ఈ క్రమంలోనే రీసెంట్గా క్లిం కారా పిక్చర్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతుంది.

అయితే ఇది ఒరిజినల్ ది కాదు ఏఐ సహాయం ద్వారా అభిమానులు ఇలా క్రియేట్ చేశారు . దాదాపు 80% క్లింకార ఇలానే ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇది మొత్తం ఉపాసన ఫేస్ కట్స్ కలిగి ఉంది అని.. ఉపాసన లాగే పాప జన్మించింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అచ్చం అంజనాదేవి లాగే ఉంది అని చిరంజీవి అమ్మగారి పోలికలు పాపకు బాగా వచ్చాయని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news