Newsభ‌గ‌వంత్ కేస‌రి పై మెగా వీరాభిమాని రివ్యూ... పులిని తక్కువ అంచనా...

భ‌గ‌వంత్ కేస‌రి పై మెగా వీరాభిమాని రివ్యూ… పులిని తక్కువ అంచనా వేసిన గుంట నక్కలు…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన తాజా సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా నిన్న విజ‌య్ లియో సినిమాతో పాటు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన సినీ సెల‌బ్రిటీల‌తో పాటు ప‌లువురు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ఓ మెగాభిమాని బాల‌య్య‌తో పాటు సినిమాను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతూ రాసిన ఓ రివ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పిచ్చ‌పిచ్చ‌గా వైర‌ల్ అవుతుండ‌డంతో పాటు అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.

ఈ రివ్యూపై ఓ లుక్కేద్దాం.
ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా… టికెట్ తీసి లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చున్న చాలా సమయం వరకూ సాదాసీదాగానే అనిపించింద‌ని… హీరో ఎంట్రీ కూడా మామూలుగా ఉన్నా.. బాల‌య్య స్థాయికి తగ్గట్టు లేదేమో అనిపించేసింద‌ని చెప్పాడు. అదే టైంలో ఇంటర్వల్ సమయం దగ్గర పడుతోన్నా హీరో మార్క్ నాకైతే ఆ స్థాయిలో కనిపించలేదు. దర్శకుడి శైలి కూడా కనిపించలేదు.. ఇంకా ఏదో ఉంటే బాగుంటే బాగుండేమో అనిపించింది…!

అప్పుడు వచ్చింది ఒక ఫైట్ సీన్… దుమ్ము దులిపేసే ఫైట్ సీన్.. సినిమా రూపాన్నే మార్చేసిన ఫైట్ సీన్ అది. పులిని తక్కువ అంచనా వేసిన గుంట నక్కల మీదకు అదే పెద్ద పులి పడి ఆ నక్కల మెడలను కొరికేస్తూ ప్రక్కకు విసిరేస్తే ఎలా ఉంటదో ఆ ఫైట్ సీన్ అలా ఉంటది…! అక్కడి నుండి సినిమాలోకి లీనం అయిపోతాడు ప్రేక్షకుడు..! ఈసారి కాస్త విభిన్నమైన కథతోనే బాలయ్య బాబు వచ్చాడు. అతని స్థాయికి తగ్గ కథ ఇది.. సీనియర్ హీరోలు మాత్రమే మోయగలిగే కథ అని ఆ మెగాభిమాని త‌న రివ్యూలో రాసుకొచ్చాడు.

బాలయ్య బాబు అంటేనే బహుశా పూనకం వచ్చేస్తుందేమో తమన్ గారికి.. ప్రాణం పెట్టేశాడు.. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గుండెలు అదిరిపోతాయ‌ని తెలిపాడు. అనిల్ రావిపూడి గారు బాలయ్య బాబు కోసం సినిమా చేస్తే… బాలయ్య బాబు ఆడబిడ్డల ధైర్యానికి సంబంధించిన అంశం కోసం సినిమా చేశారు..
చాలా హాస్య ప్రధాన సినిమాలు తీసిన దర్శకుడు ఇంతలా యాక్షన్ పండించే సన్నివేశాలు కూడా తీయగలిగాడా అన్నంతలా దర్శకుడి ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తుంది…!!

ఆడబిడ్డలకు హాని చేస్తున్న ఉన్మాదపు అంశాల పట్ల ధైర్యంగా, నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా బాలయ్య బాబు చేతనే సమాజానికి పాఠం చెప్పించేశాడు దర్శకుడు.. ఆ దృశ్యం చూసిన ప్రతి ప్రేక్షకుడూ కంట నీరు పెట్టుకోవడం ఖాయమ‌న్నాడు. గుండెలకు హత్తుకునే దృశ్యాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో..!! యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా పండించడం బాలయ్య బాబుకి కొట్టిన పిండి…!!

శ్రీలీల మరోసారి తన నటనతో ఆకట్టుకుంది.. సెంటిమెంట్ సన్నివేశాల్లో బాలయ్య బాబుతో పోటీపడి నటించింది ఆమె.. మాటలు బాగా కుదిరాయి…. బలంగా పడ్డాయి సన్నివేశాలకు తగ్గట్టు… మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ధైర్యం నూరిపోసి తమ కాళ్ళ మీద తామే నిలబడే స్థాయిలో పెంచాలన్న అంశం అందరినీ ఆకట్టుకుంటుంద‌ని తెలిపాడు.

ఏదేమైనా ఈ రివ్యూ అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. అటు నంద‌మూరి, బాల‌య్య అభిమానులు కూడా రివ్యూ అదిరిపోయింద‌ని కామెంట్లు చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news