మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది వచ్చిన మరో చిత్రం భోళాశంకర్ చిరు కెరీర్ లోనే ఎపిక్ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అందులో ఒకటి చిరు పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత నిర్మించే సినిమా. ఈ సినిమాకు కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.
ఇక చిరు కెరీర్లో 157 వ సినిమాకు బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉన్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై రూ.150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ప్రస్తుతం చిరు మోకాలికి శస్త్ర చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
మరో మూడు నెలల పాటు చిరంజీవి విశ్రాంతి తీసుకుంటారని ఆ తర్వాత చిరు, వశిష్ట సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పై ఓ అదిరిపోయే క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది. ఈ యేడాది డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఆరేడు నెలల పాటు VFX వర్క్ నిర్వహిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను 2025 సంక్రాంతి కనుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలన్నది నిర్మాతల ప్లాన్ గా తెలుస్తోంది. చిరుకు జోడిగా నటించే హీరోయిన్లు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.