Moviesమందు పార్టీలో మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్..కానీ, ఆ ఇద్దరు మిస్సింగ్..గమనించారా..!

మందు పార్టీలో మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్..కానీ, ఆ ఇద్దరు మిస్సింగ్..గమనించారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ దక్కించుకున్న వరుణ్ తేజ్ .. లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే అందరూ ఇటలీ చేరుకునేసారు. రీసెంట్గా ఇటలీలో వీళ్లు కాక్‌ టెయిల్‌ పార్టీ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా వరుణ్ లావణ్య చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు కొత్త కపుల్ కన్నా రామ్ చరణ్ – ఉపాసన ఇంకా ఇంకా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . చాలా ఘనంగా చాలా స్టైల్ గా ఈ పార్టీ ని జరుపుకున్నారు. డ్రెస్ కోడ్ పెట్టి మరి కాక్‌ టెయిల్‌ పార్టీ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే అందరూ కనిపిస్తున్న సరే ఈ కాక్‌ టెయిల్‌ పార్టీలో అల్లు అరవింద్ తన భార్య కనిపించలేదు .

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఈ పార్టీలో కొందరు పెద్దవాళ్లు కూడా కవర్ కాకపోవడం గమనార్హం. మొత్తంగా కాక్‌ టెయిల్‌ పార్టీని మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసిందని ..ఫోటోలు చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. ఈరోజు అక్టోబర్ 31 హల్దీ మెహందీ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. రేపు నవంబర్ 1 మధ్యాహ్నం 2:48 నిమిషాలకు వరుణ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు . ఇటలీలో చాలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ . దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news