ఇటు సూపర్‌స్టార్ కృష్ణకు స్వయానా అల్లుడు.. అటు తాజా సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు స్వయానా బావమరిది. ఈ బ్రాండ్‌తోనే సుధీర్‌బాబు టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా హీరోగా నిలదొక్కుకుంటూ వస్తున్నారు. ఏదో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టుగా సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయే కాని.. హిట్లు మాత్రం లేవు.
సుధీర్‌బాబు గత కొన్నేళ్లలో చేసిన సినిమాల పేర్లు కూడా చాలా మంది సినీ అభిమానులకు సరిగా గుర్తు కూడా లేవు. ప్రేమకథా చిత్రమ్ మినహా ఆ తర్వాత ఆ స్థాయిలో సుధీర్‌కు హిట్టు పడలేదు. తాజాగా సుధీర్ మామా మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 10 చిన్నా చితకా సినిమాలతో పోటీ పడుతూ ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
సుధీర్‌బాబు త్రిపాత్రాభినయం ఒక కొత్తదనం అయితే… అమృతం ఫేం హర్షవర్థన్ రచన, దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో కాస్తంత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా తొలి రోజు వసూళ్లు చాలా దరుణమైన రికార్డును నమోదు చేశాయి. ఎంత చెత్త రికార్డు అంటే జీరో గ్రాస్ నమోదు అయ్యింది.
అంటే తొలి రోజు గ్రాస్ కూడా జీరో వచ్చిందంటే అసలు థియేటర్ల మెయింటైన్స్ కోసం రావాల్సిన ఖర్చులు కూడా రాలేదు. దీంతో ఇక షేర్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. అంటే మైనస్ షేర్ అనుకోవాలి. నిర్మాత సినిమాను ఆడించినందుకు తిరిగి థియేటర్లకే ఎంతో కొంత కట్టాల్సిన పరిస్థితి. ఇది నిజంగానే సుధీర్‌బాబు కెరీర్‌లో చెత్త రికార్డు కాగా… మనోడి కెరర్ ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం అనుకోవాలి.