ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కాలంలో వరుసగా బ్రాండ్ల ప్రమోషన్లకు ఓకే చెబుతున్నాడు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పైగా పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ జాతియ స్థాయిలో ఉత్తమ హీరో అవార్డు అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ కి స్టార్‌డం పెరిగింది.
ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ లో ఏ తెలుగు హీరో కూడా పోటీ రాని పరిస్థితి.. పుష్ప సినిమా దెబ్బతో తమ సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు పలు బహుళ జాతి కంపెనిలు కూడా బన్నీ వద్దకు క్యూకడుతున్నాయి. దీంతో బన్నీ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నాడు. పుష్ప సూపర్ హిట్ అయ్యాక బన్నీ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తున్న పరిస్థితి.
అల్లు అర్జున్‌తో ఒక యాడ్ చేస్తే ఆ యాడ్ ను దేశం మొత్తంలో టెలికాస్ట్ చేయవచ్చు అన్న నిర్ణయానికి బహుళ జాతి కంపెనీలు వచ్చేసాయి. ఇక మహేష్ బాబు కూడా ఎప్పటినుంచో పలు సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే మహేష్ బాబు చేసే యాడ్స్ సౌత్ ఇండియా లేదా తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. పుష్ప సినిమాకు ముందు వరకు యాడ్స్ ప్రమోషన్లలో బన్నీ కంటే మహేష్ వైఫై కంపెనీలు మగ్గు చూపేవి.
పుష్ప సినిమా సూపర్ హిట్ అయ్యాక పలు కంపెనీలు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలంటే మహేష్ కంటే బన్నీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి. మహేష్ బాబు చాలా సంవత్సరాలుగా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ పెద్ద మొత్తంలో వెనకేసుకుంటున్నాడు. అయితే ఇటీవల ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు మహేష్ ను దాటేసి ముందుకు దూసుకుపోతున్నాడు. సో ఇలా నేషనల్ లెవెల్ లో చూసుకుంటే మహేష్ బ్రాండ్ కంటే బన్నీ బ్రాండ్ ఎక్కువగా ఉందనే చెప్పాలి.