Newsగుంటూరు కారంతో బన్నీకి సరికొత్త సవాల్ విసిరిన మహేష్..టాలీవుడ్ లోనే అతిపెద్ద...

గుంటూరు కారంతో బన్నీకి సరికొత్త సవాల్ విసిరిన మహేష్..టాలీవుడ్ లోనే అతిపెద్ద రిస్క్ ఇది..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో కంటే బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఖలేజా వచ్చి కూడా 13 ఏళ్లు అవుతుంది ఈ క్రమంలోని వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వస్తున్న సినిమా గుంటూరు కారం.

గుంటూరు కారం సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇద్దరు యంగ్ క్రేజీ హీరోయిన్లు మహేష్ కి జోడిగా నటిస్తున్నారు. అటు శ్రీ లీల, మీనాక్షి చౌదరి, త్రివిక్రమ్ మ్యాజిక్ ఎలా చూసుకున్నా కాంబినేషన్ అంతా హై రేంజ్ లో ఉంది. ఇప్పటికే శ‌రవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు తెలుగులో అందరు హీరోలు పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తున్నారు.

తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసేలా మార్కెట్ స్ట్రాటజీ పెంచుకుంటున్నారు. అయితే గుంటూరు కారం సినిమా మేకర్స్ కేవలం తెలుగు రిలీజ్ మాత్రమే అంటూన్నారు. రీజనల్ సినిమాతోనే మహేష్ తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ రికార్డు సెట్ చేశారు. జస్ట్ తెలుగు వెర్షన్లో గుంటూరు కారం ఏకంగా రూ.120 కోట్ల బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కాకుండా కేవలం ఏపీ- తెలంగాణలోని గుంటూరు కారం సినిమాకు రూ.120 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు.

రూ.120 కోట్ల షేర్ కేవలం ఏపీ తెలంగాణలో రావాలి అంటే కనీసం రూ.180 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుంది. మరి మహేష్ – త్రివిక్రమ్ పవర్ ఎలా చూపెడతారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

బన్నీ లాంటి హీరోలు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న తెలుగు వరకు చూసుకుంటే అందులోను ఏపీ- తెలంగాణ వరకు మహేష్ సినిమాకు రూ.120 కోట్లు అంటే గతంలో ఏ తెలుగు హీరోకు ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు. ముఖ్యంగా మహేష్- బన్నీకి తెలుగు స్టేట్స్ వరకు పెద్ద సవాల్ విసిరాడని.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రూ.120 కోట్ల షేర్ రాబడితే బన్నీ ముందు సరికొత్త రికార్డు సెట్ చేసినట్టు అవుతుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news