టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – ప్రస్తుతం మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో 13 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై మామూలు అంచనాలు లేవు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ దర్శకుధీరుడు రాజమౌళి కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ కథతో మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తానని రాజమౌళి ఇప్పటికే చెప్పడంతో ప్రాజెక్టు పై ప్రపంచ సినీ అభిమానుల్లోనే అంచనాలు వచ్చేసాయి. పైగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈ సినిమాపై పాన్ వరల్డ్ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో కూడా ఒక ప్రాంచైజీ అయ్యేలా చేయాలనేది జక్కన్న ప్లాన్, సీక్వెల్, ఫ్రీక్వెల్ అనేలా కాకుండా ఒక వరల్డ్ క్రియేట్ చేసి అందులో నుంచి సినిమా చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.
మన దగ్గర ప్రాంచైజీలు చాలా ఉన్నాయి. అయితే లార్జర్దెన్ లైఫ్ స్కేల్లో రూపొందిన ప్రాంచైజీలు అయితే లేవు. ఇప్పుడు రాజమౌళి – మహేష్ కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఈ యేడాది డిసెంబర్ నుంచి SSMB 29 పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు స్కెచ్ ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంది. మహేష్ అభిమానులు ఎవరో పెన్సిల్ ఆర్ట్ తో మహేష్ ఇమేజ్ నరీలు డిజైన్ చేసి ఆ స్కెచ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇవి అద్భుతంగా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ లుక్ లో మహేష్ బాబు SSMB 29 సినిమా చేస్తే మిషన్ ఇంపాజిబుల్ – ఇండియానా జోన్స్ రేంజ్ లో ఇంపాక్ట్ ఇవ్వడం గ్యారెంటీ జక్కన్న.. మా మహేష్ అన్న కొత్త లుక్కు పై ఒక లుక్కేయన్న అని కామెంట్ చేస్తున్నారు. మహేష్ అందం ముందు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కూడా ఎందుకు పనికిరాడు అని మహేష్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.