తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు ఎప్పుడు అడ్వాన్సుడ్ గానే ఉంటారు. వారు నటులుగానే కాకుండా ఇటు సినిమాలు నిర్మించడం.. అటు రకరకాల వ్యాపారాలు చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఇక భారీ మల్టీప్లెక్స్‌లను రన్ చేయటం కూడా ఆధునిక వ్యాపారంగా మారిపోయింది. 2018లో ఈ రంగంలో మొదట ఎంట్రీ ఇచ్చింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి పేరుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించారు.
హైదరాబాద్‌లో ఎన్ని మల్టీఫ్లెక్స్‌లు ఉన్నా కూడా ఈ ఏఎంబీ హైదరాబాద్‌కే తలమానికంగా మారింది. ఇప్పుడు సెలబ్రిటీలు సినిమా చూడాలన్నా కూడా ఈ మల్టీఫ్లెక్స్కే వెళుతున్నారు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఏ పిక్ పేరుతో భారీ థియేటర్ నిర్మించారు. ప్రభాస్ నటించిన సాహో సినిమా నుంచి ఇది ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత విజయ దేవరకొండలో కూడా తన సొంత ఊరు మహబూబ్ నగర్లో ఏవిడి పేరుతో మూడు స్క్రీన్లు ఉన్న మల్టీప్లెక్స్ రన్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ అమీర్‌పేటలోని సత్యం థియేటర్ స్థానంలో అల్లు అర్జున్ కూడా ఏఏఏ పేరుతో భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఈ మల్టీఫ్లెక్స్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో ఇప్పుడు వీరంతా తమ రెండో మల్టీప్లెక్స్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీ తన రెండో మల్టీప్లెక్స్ ను హైదరాబాద్ కోకాపేటలో నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. హైదరాబాదులో అత్యంత ఖరీదైన ఏరియాలలో కోకాపేట కూడా చేరిపోయింది. ఇక్కడ అల్లు అరవింద్ గతంలోనే ల్యాండ్ కొన్నారు.. అదే ప్లేస్ లో ఇప్పుడు బన్నీ ఏఏఏ పేరుతో మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక మహేష్ AMB తర్వాత రెండో ప్రాజెక్ట్‌ను బెంగళూరులో ఎప్పుడో స్టార్ట్ చేశారు. త్వరలోనే అక్కడ కూడా ఏఎంబీబి పేరుతో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతుంది. దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా AVD పేరుతో హైదరాబాద్‌లో మరో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.