Movies'గుంటూరు కారం' విషయంలో మహేష్ క్రేజీ కండీషన్.. త్రివిక్రమ్ తిక్క ఫుల్...

‘గుంటూరు కారం’ విషయంలో మహేష్ క్రేజీ కండీషన్.. త్రివిక్రమ్ తిక్క ఫుల్ గా దిగ్గిపోయిందిగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాకి గుంటూరు కారం అంటూ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. గుంటూరు కారం అంటూ ఘాటు అయిన టైటిల్ పెట్టిన సినిమాలో ఘాటైన సీన్స్ ఉన్న షూట్ విషయంలో మాత్రం త్రివిక్రమ్ అంత ఘటైన గాంభీర్యత్వాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ తనకు నచ్చిన విధంగా ఈ సినిమాను పచ్చడి చేసేస్తున్నాడు తప్పిస్తే ఎక్కడ మహేష్ బాబు రేంజ్ కి తగ్గ విధంగా ఈ సినిమాల్లో సీన్స్ యాడ్ చేయలేకపోతున్నాడు అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు పూజ హెగ్డే ఈ సినిమా నుంచి హీరోయిన్గా తీసేయడం గుంటూరు కారం కు బిగ్ మైనస్ అయింది . ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ లు మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు కూడా ఈ సినిమా విషయంలో పెద్దవిగా మారిపోయాయి . అయితే మరికొద్ది రోజుల్లోనే సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది అనుకున్న టైం లో మహేష్ బాబు త్రివిక్రమ్ కి క్రేజీ కండిషన్ పెట్టారట .

ఈ సినిమా హిట్ అయితేనే మళ్లీ మీతో సినిమా చేస్తా.. ఒకవేళ ఈ సినిమా టాక్ అటు ఇటు ఉన్న.. నా నటన బాగుంది ..మీ కథ డుంకి కొట్టిన.. సినిమా ఫ్లాప్ పైన ఇక ఇదే మన కాంబినేషన్లో వచ్చే ఆఖరి సినిమా అంటూ తేల్చి చెప్పేసాడట . దానికి కారణం కూడా త్రివిక్రమ్ ఓవర్ బిహేవియర్ అంటూ తెలుస్తుంది . గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ పూర్తిగా మహేష్ బాబు సహనాన్ని కోల్పోయేలా చేశాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మొత్తానికి ఒక్క కండిషన్స్ తో త్రివిక్రమ్ తిక్క కూడా కుదిరిపోయింది అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news