Newsరీ ఎంట్రీ త‌ర్వాత అక్ష‌రాలా రు. 537 కోట్లు... మెగాస్టార్ క్రియేట్...

రీ ఎంట్రీ త‌ర్వాత అక్ష‌రాలా రు. 537 కోట్లు… మెగాస్టార్ క్రియేట్ చేసిన హిస్ట‌రీ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల కెరీర్లు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఒకప్పుడు టాలీవుడ్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల దగ్గర రెండు రోజులు ముందు నుంచే టిక్కెట్ల కోసం క్యూ ఉండేది. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో రికార్డులు.. రివార్డులు.. అవార్డులు సొంతం చేసుకున్నారు. పదేళ్లపాటు సినిమాల‌కు దూరంగా ఉన్నా కూడా చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు.

పైగా ఆ సినిమా తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమాకు రీమిక్ గా వచ్చింది. అలాంటి సినిమాతో కూడా చిరంజీవి ఇక్కడ అదిరిపోయే హిట్ కొట్టారు. ఇక రీఎంట్రీ ఇచ్చాక చిరంజీవి జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 – సైరా – నరసింహారెడ్డి – ఆచార్య – గాడ్ ఫాదర్ – వాల్తేరు వీరయ్య తాజాగా భోళా శంకర్ సినిమాలో నటించారు. ఈ మూడు సినిమాలలో ఖైదీ నెంబర్ 150 – వాల్తేరు వీర‌య్య‌ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

సైరా నరసింహారెడ్డి కూడా పరవాలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ మాత్రం డిజాస్టర్లు అయ్యాయి. రీఎంట్రీ తర్వాత చిరంజీవి అన్ని సినిమాలను కలిపితే రు. 567 కోట్ల రూపాయల షేర్‌ వసూళ్లు వచ్చాయి. ఇది మామూలు హిస్టరీ కాదని చెప్పాలి. ఖైదీ నెంబర్ 150కి 104 కోట్లు – సైరా నరసింహారెడ్డికి 143 కోట్లు – వాల్తేరు వీర‌య్య‌ సినిమాకు రు. 137 కోట్ల షేర్ వ‌సూళ్లు వచ్చాయి.

ఆచార్య సినిమా ప్లాప్ అయినా 40 కోట్ల షేర్ రాబట్టింది. భోళాశంకర్ డిజాస్టర్ అయినా కూడా 30 కోట్ల వసూళ్లు వచ్చాయి. గాడ్ ఫాదర్ సినిమాకు కూడా 50 కోట్లకు కాస్త అటు ఇటుగా వసూళ్లకు వచ్చాయి. ఈ రేంజ్ ట్రాక్ రికార్డు ఈతరం స్టార్ హీరోలకు కూడా లేకపోవడం విశేషం. 68 ఏళ్ల వయసులోనూ ఆయన నేటి తరం కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ముల్లోకవీరుడు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news