శ్రీలీల.. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది ఓ పెద్ద మెడిసిన్ ల తయారయిపోయింది . ఈ పేరు చెప్తే జనాలు ఊగిపోతున్నారు. మరికొందరు జనాలు మంచి కిక్ వస్తుంది అంటున్నారు . మరికొందరు మా ఇంటి ఆడపిల్ల అంటున్నారు . ఇలా ఓ తండ్రికి కూతురుగా.. ఓ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ గా చాలా చాలా ఆకట్టుకుంటుంది .శ్రీ లీల సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంతటి స్టార్ స్టేటస్ అందుకుంది .
శ్రీ లీల రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయింది . ఇందులో గ్లామర్ కు దూరంగా నటనకు దగ్గరగా ఉన్న శ్రీలీలను మనం గమనించవచ్చు . అయితే ఇన్నాళ్లు శ్రీలీల అంటే డాన్స్ బాగా చేస్తుంది.. చక్కగా మాట్లాడుతుంది.. చక్కగా నటిస్తుంది ..ఇవే తెలుసు . కానీ దుమ్ము దులిపేసే రేంజ్ లో ఫైట్లు కూడా చేస్తుంది అంటూ అనిల్ రావిపూడి ప్రూవ్ చేశాడు.
శ్రీ లీల ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది . గాలిలోకి ఎగురుతూ విలన్స్ ని తంతూ.. వామ్మో మన శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అనిపించే అంతలా మెప్పించింది . దీంతో జనాలు శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా బయట పెడితే ఇక పదేళ్లపాటు ఇండస్ట్రీలో డోకానే లేదు అని ..నెంబర్ వన్ హీరోయిన్ స్థానం ఆమెది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!