టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు అయితే బాలయ్య అంటే మాత్రం జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు. దానికి రీజన్ ఆయన నిజాయితీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తప్పు చేస్తే దండించడం ..మంచి చేస్తే పొగడడం.. బాలయ్య బ్లడ్ లోనే ఉంది . కాగ బాలయ్య భార్య వసుంధర పెళ్లి తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఆయనను ఓ కోరిక కోరింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎస్ బాలయ్య భార్య వసుంధర తన కొడుకుకు శ్రీ లీల అయితే బాగుంటుంది అంటూ చాలా ఆశపడుతుందట . మోక్షజ్ఞకు శ్రీలీలకు పెళ్లి చేస్తే చాలా చాలా బాగుంటుంది అంటూ కోరుకుంటుందట. ఇదే విషయాన్ని బాలయ్యకు చెప్పగా బాలయ్య నవ్వి సైలెంట్ గా ఊరుకున్నాడట . త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అనఫీషియల్ గా బాలయ్య సైతం ఈ విషయాలను కన్ఫామ్ చేసేసాడు .
అంతేకాదు తెరపై బాలయ్య కొడుకు మోక్షజ్ఞ శ్రీ లీల నటిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక కూడా.. పరిస్థితులు చూస్తుంటే ఈ అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల నందమూరి ఇంటి కోడలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు జనాలు . అంతేకాదు భగవంత్ కేసరి సినిమా ద్వారా శ్రీ లీల బాలయ్య చాలా దగ్గర అయిపోయారు . మరి అలాంటి మంచి అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవడానికి బాలయ్యకు ఏమాత్రం అభ్యంతరం ఉండదు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు..!!