Moviesఅయ్యయ్యో..సింగర్ గీతామాధురి కూడా విడాకులు తీసుకోబోతుందా..? కుండ బద్దలు కొట్టేసిన్నట్లు చెప్పేసిన...

అయ్యయ్యో..సింగర్ గీతామాధురి కూడా విడాకులు తీసుకోబోతుందా..? కుండ బద్దలు కొట్టేసిన్నట్లు చెప్పేసిన నందు..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చిన్న గొడవలకే తగాదాపడి విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం. అయితే కొంతమంది విడాకులు తీసుకోకపోయినా మీడియాలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానిపై ఆ జంట ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేస్తుంది . రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ పై స్పందించాడు యంగ్ హీరో నందు .

స్టార్ సింగర్ గీతామాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నందు ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . అయితే గత కొంతకాలం నుంచి వీళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. బయట కూడా జంటగా కనిపించడం లేదు . ఈ క్రమంలోనే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది.

అయితే రీసెంట్ గా మాన్షన్ 24 లో నటించిన నందు ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. విడాకులపై క్లారిటీ ఇచ్చారు . “నేను గీత ఈ వార్తలు విని నవ్వుకున్నామని .. మేము కూడా విడాకులు తీసుకోబోతున్నాము అంటూ వార్తలు రాశారని ..అయితే అందులో ఏం మాత్రం నిజం లేదు ” అంటూ చెప్పుకొచ్చాడు . అయితే కొందరు గీతా-నందు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని బాధపడిపోయారు..పాపం అంటూ ఫీల్ అయిపోయారు..ఆ తరువాత ఇదంతా ఫేక్ అంటూ కూల్ అయిపోయారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news