పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు సమంత ఏదో ఊహించుకొని ఏదేదో చేసేద్దాం అని విడాకులు తీసుకుంటే.. అది కాస్త ఉల్టా పల్టాగా మారిపోయింది . విడాకులు తీసుకున్న తర్వాత సమంత లైఫ్ ఎలా అప్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోతుందో మనం చూస్తూనే వచ్చాం. సినిమా ఇండస్ట్రీలో విడాకుల తర్వాత ఆమె హిట్ కొట్టిందే లేదు .
రీసెంట్ గా వచ్చిన ఖుషి తప్పిస్తే విడాకుల తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపే . అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా అవస్థలు పడిన సమంత చేతిలోకి పలు సినిమాలు వచ్చిన అవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అలాంటి ఓ సినిమానే ది గర్ల్ ఫ్రెండ్ . రష్మిక మందన రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట.
ఆమె కూడా ఓకే చేసింది . అయితే ఆరోగ్యం బాగోలేని కారణంగా ఎక్కువ కాలం పోస్ట్ పోన్ చేస్తూ రావడంతో ఆ ప్లేస్ లోకి రష్మిక మందన్నాను తీసుకొచ్చారు మేకర్స్ . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాను డైరెక్టర్ చేసేది రాహుల్ రవీంద్రన్. అయితే రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సమంతకు ఎంత జాన్ జిగిడి దోస్త్ అనేది తెలిసిందే . ఆఖరికి వాళ్ళు కూడా సమంత కోసం టైం కేటాయించలేకపోయారు .. సమంతను కాదు అంటూ వేరొకరికి ఛాన్స్ ఇచ్చారు అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు..!!