సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది అభిమానులు హద్దులు మీరేస్తున్నారు మరీ ముఖ్యంగా లేడీస్ విషయంలో అయితే అబ్బాయిలు మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో లైవ్ కొస్తే చాలు ఏదో ఒక వల్గర్ ప్రశ్నతో సదరు సెలబ్రిటీకి కోపం తెప్పిస్తున్నారు. కాగా రీసెంట్గా ఓ నెటిజన్ బిగ్బాస్ ఫేమ్ ప్రియాంక కు కోపం తెప్పించాడు . అంతేకాదు ఆమెను ఒక నైట్ కి ఎంత తీసుకుంటావు అంటూ స్ట్రైట్ గా అడిగేసాడు.
దీంతో మండిపోయిన ప్రియాంక సింగ్ అతనికి కోపంతో గుయ్యమనే ఆన్సర్ ఇచ్చింది . జబర్దస్త్ షో తో వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లలో ప్రియాంక అలియాస్ పింకీ కూడా ఒకరు . ప్రియాంక ఎంత అందంగా ఉంటుందో అంత మంచి మనసు కూడా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వచ్చారు . హీరోయిన్స్ కి మించిపోయే అందం అంటూ పొగిడేస్తూ ఉంటారు. కాగా బిగ్ బాస్ తర్వాత పలు ఈవెంట్స్ లో పాల్గొంటున్న ప్రియాంక సింగ్ రీసెంట్గా తన ఇన్స్టా లో వీడియోని పంచుకుంది .
ఓ నెటిజన్ ఒక రాత్రికి ఎంత తీసుకుంటావు..? అని అడిగారు అంటూ ఫైర్ అయిపోయింది . అంతేకాదు దానికి ఆన్సర్ ఇస్తూ..” నన్ను ఒక రాత్రికి ఎంత తీసుకుంటావని అడిగావు కదా ..? ముందు మీ నాన్న మీ అమ్మకు ఎంత ఇస్తారు అని అడిగి తెలుసుకో.. అంతే తీసుకొని నువ్వు నా దగ్గరికి రా ” అంటూ కూల్ గా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రియాంక సింగ్ చేసిన పనికి జనాలు ఫిదా అవుతున్నారు, అంతేకాదు అతగాడికి బుద్ధి వచ్చేలా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .