సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు ఫ్యాన్స్ హద్దులు మీరిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పుడెప్పుడో వార్తలను తవ్వి లోడి బయటకు తీస్తున్నారు . మరికొందరు తమ అభిమాన హీరోకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ లో జాన్వి కపూర్ పాత్ర హైలెట్ గా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ బావ మరదలుగా కనిపించబోతున్నారట. అయితే రియల్ వరుసకు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు మేనత్త అవుతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. దానికి పెద్ద ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు . దివంగత మహానటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .
ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే బాలకృష్ణతో మాత్రం నటించలేదు. దానికి కారణం నేను ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించానని అప్పుడు మీకు వరుసకు అమ్మనవుతానని అందుకే మీతో నటించలేను అంటూ చెప్పుకొచ్చిందట . అలా చూసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ కు జాన్వికపూర్ మేనత్త అవుతుంది. బాలకృష్ణ గారికి తల్లి లాంటిది అంటే జూనియర్ ఎన్టీఆర్ కి నాయనమ్మ ..నాయనమ్మ కూతురు జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ కి మేనత్త అవుతుంది కదా అంటూ పలువురు ఫాన్స్ ఫన్నీగాట్రోల్ చేస్తున్నారు జనాలు .దీంతో వరుసలు మార్చేసావ్ కదా కొరటాల అంటూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . కావాలనే కొందరు ఆకతాయి లు ఇలా చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . దీంతో ఎన్టీఆర్ దేవరకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాయి..!!