టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా మయోసైటీస్ వ్యాధికి గురైన తర్వాత సమంత తన హెల్త్ డైట్ టోటల్ మార్చేసింది . కడుపునిండా అన్నం కూడా తినడం లేదు . అసలకే డైటింగ్లు అంటూ కడుపు మాడ్చుకునే సమంత ఇప్పుడు మరింత బక్క చిక్కిపోయింది .
అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసింది . నేను ఈ ఫుడ్ ని చాలా మిస్ అవుతున్నాను .. గత ఏడాది నుంచి అంటూ పోస్ట్ చేసింది . ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా ..? బ్రెడ్ అవును.. మీరు విన్నది నిజమే . సమంత ఒక ఏడాది నుంచి కనీసం ఒక బ్రెడ్ ముక్కను కూడా తినలేదట . ఏడాది నాలుగు నెలల తర్వాత మొదటిసారి బ్రెడ్ తింటున్నట్లు ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది .
ఎలాంటి మసాలాలు లేకుండా.. ఎగ్ లేకుండా.. కెమికల్స్ లేకుండా ఉన్న బ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటూ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి. కొందరు సమంత పరిస్థితిని చూసి జాలి పడుతుంటే.. మరి కొందరు నీకు తగిన శాస్తి జరిగింది అంటూ ఇక్కడ కూడా ఆమెను దెప్పిపొడుస్తున్నారు..!!