సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఒకరి కోసం రాసుకున్న రోల్స్ మరొకరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ..తప్పని పరిస్థితిలో అలా చేయాల్సి ఉంటుంది . అయితే అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన వేదం సినిమాలో కూడా అలాంటి సిచువేషన్ ఎదురయింది . వేదం సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు .
కానీ ఎంతోమంది జనాలకు మనసుకు టచ్ చేసింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి వేశ్య పాత్రలో కనిపించి మెప్పించింది . ఆమెకు ఫ్రెండ్ గా కర్పూరం పాత్రలో అనుష్క మేకప్ మ్యాన్ నిక్కీ చేశారు . అయితే నిజానికి ఈ పాత్రను డైరెక్టర్ క్రిష్ నే చేయాలనుకున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మగారు వద్దురా బాబు అసలే నీకు పెళ్లి కావట్లేదు ..
అలాంటి క్యారెక్టర్ చేస్తే ఇక జన్మలో పెళ్లి కాదు అంటూ భయపడిపోయి ..వద్దనే వద్దు అంటూ తెగ్గేసి చెప్పిందట . దీంతో తల్లి మాటకు కట్టుబడి క్రిష్ ఆ రోల్ ని ఎంతో ఇష్టంగా రాసుకున్న మిస్ చేసుకున్నాడు . ఆ తర్వాత అనుష్క మేకప్ మ్యాన్ కి ఆ రోల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు..!!