పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది . అందానికి అందం నటనకి నటన ..మంచితనానికి మంచితనం.. కోపానికి కోపం అన్ని విషయాలలో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ఈ ఆరడుగుల అందగాడు. ప్రభాస్ రీసెంట్ గానే తన 44వ పుట్టినరోజును చాలా చాలా ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు .
అంతేకాదు నెక్స్ట్ బర్త్డ డేకి తన భార్యతో కనిపించబోతున్నాడు అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సైతం చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి కోపం వస్తే మాట్లాడే ఓ బూతు ఊత పదం గురించి నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ కి జనరల్ గా కోపం రాదు ..చాలా చాలా తక్కువగా వస్తుంది .. కోపం ఎంత ఎక్కువ వచ్చినా సరే ఎదుటివారిపై చూపడు . కామ్ గా రూమ్ లోకి వెళ్లి తన పని తాను చేస్తాడు.
ప్రభాస్ ఊత పదం డార్లింగ్.. బుజ్జిగాడు సినిమా నుంచి ఈ పదాన్ని తన ఊత పదముగా మార్చేసుకున్నాడట ప్రభాస్ అంతేకాదు. అంతకుముందు కోపం వస్తే ఎక్కువగా “నీ డాష్ ” అంటూ మాట్లాడేవారట. ఎప్పుడైతే బుజ్జిగాడు సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి డార్లింగ్ అన్న పదం ఎక్కువగా వాడుతూ వస్తున్నాడట. మన లైఫ్ లో కూడా చాలామంది డాష్ అన్న మాటలు మాట్లాడుతూనే ఉంటాం . ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా డార్లింగ్ డార్లింగ్ అంటూ మాట్లాడుతూనే ఉంటారు..!!