Moviesఅప్పుడు శ్రీలీల..ఇప్పుడు కృతిశెట్టి..ఆ స్టార్ హీరోకి కూతురుగా బేబమ్మ..ట్విస్ట్ అద్దిరిపోలా..!

అప్పుడు శ్రీలీల..ఇప్పుడు కృతిశెట్టి..ఆ స్టార్ హీరోకి కూతురుగా బేబమ్మ..ట్విస్ట్ అద్దిరిపోలా..!

ఏంటో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ భలేఅ భలే మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు .కేవలం గ్లామరస్ గా కనిపిస్తే సరిపోదు ..నటనపరంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలని చూస్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ట్రెండ్ మార్చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చడ్డీలు – మిడ్డీలు – బికినీలు వేసుకొని ఎక్స్పోజ్ చేసే హీరోయిన్స్ సైతం పద్ధతిగా ఉండే రోల్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు . కాగా తాజాగా కృతిశెట్టి ఓ స్టార్ హీరోకి కూతురుగా నటించడానికి ఆక్సెప్ట్ చేసిందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

తెలుగులో పాపులారిటీ దక్కించుకున్న ఆమె.. కోలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా కృతి శెట్టి బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. కమల్ హాసన్ నయనతార కాంబోలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కృతిశెట్టి కమల్ హాసన్ కూతురుగా నటించబోతుందట . అంతేకాదు ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట .

మరీ ముఖ్యంగా కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ పలికించగల హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా కమల్ హాసన్ కృతి శెట్టి పేరును సజెస్ట్ చేశారు అన్న వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి కృతిశెట్టికి ఇప్పుడు హిట్ ట్రాక్ ఏ లేదు కానీ కమల్ హాసన్ ఎందుకు ఆమెను చూస్ చేసుకున్నాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . మొత్తానికి కృటి శెట్టి జాక్పాట్ ఆఫర్ అందుకుందనే చెప్పాలి . శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో కూతురు పాత్రలో కనిపించి హిట్ కొట్టింది. ఆ స్ట్రాటజీ ప్రకారమే కృతి శెట్టి కూతురు పాత్ర అయినా కమల్ హాసన్ తో నటించడానికి ఓకే చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. రీజన్స్ ఏవైనా కృతశెట్టి హిట్ కొడితే చూడాలి అన్నది అభిమానుల కోరిక. చూద్దాం ఆ కోరిక తీరుతుందో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news