Newsయంగ్ హీరోయిన్ ప్రేమలో కిరణ్ అబ్బవరం.. పేరుతో సహా బయటపెట్టేశాడుగా (వీడియో)..!

యంగ్ హీరోయిన్ ప్రేమలో కిరణ్ అబ్బవరం.. పేరుతో సహా బయటపెట్టేశాడుగా (వీడియో)..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇదే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరక్. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా వీరికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే రాజావారు రాణి గారు షూటింగ్ సమయంలో కిరణ్ – రహస్య మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాతగా ప్రేమగా మారింది అన్న గుసగుసలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరిని ప్రేమ పక్షులుగా పేర్కొంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

అయినా వీరిద్దరూ పట్టించుకోలేదు ఆ తర్వాత కిరణ్ వెకేషన్ కి వెళ్ళగా అక్కడి దిగిన ఫోటోలు షేర్ చేశాడు. అటు రహస్య కూడా అదే లొకేషన్‌లో దిగిన ఫోటో షేర్ చేయడంతో వీరిద్దరూ కలిసి షికారుకు వెళ్లినట్టు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం గృహప్రవేశ వేడుకల్లోను రహస్య సందడి చేయటంతో వీరిద్దరి మధ్య మొత్తానికి సంథింగ్ సంథింగ్ నడుస్తుందని అందరు ఫిక్స్ అయ్యారు. తాజాగా మరోసారి అడ్డంగా దొరికిపోయాడు కిరణ్.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దావత్ అనే కొత్త షోను మొదలుపెట్టింది. ఈ షోలోకి మొదటి గెస్ట్ గా విచ్చేశాడు కిర‌ణ్‌. షోలోకి వచ్చే రావటంతోనే తన లవ్ లైఫ్ గురించి అడిగేసింది హోస్ట్ అషురెడ్డి. రహస్య – గోరక్ మీరు బంధంలో ఉన్నారా ? అని అడగడంతో అలాంటిదేమీ లేదని.. అలాంటిది ఉంటే తానే చెప్తామని బదులిచ్చాడు. చెప్తాము అంటున్నారంటే ఇద్దరు కలిసి ఒకేసారి పెళ్లి డేట్ ఎప్పుడో ? చెప్తారా అని ఆట పట్టించింది అషురెడ్డి.

దీంతో సిగ్గు పడిపోయిన కిరణ్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎప్పుడు ఇంతలా దొరికిపోలేదు అని చెప్పుకొచ్చాడు. దొరికిపోయాను అంటున్నాడు అంటే ? నిజంగానే వీళ్లిద్దరూ లవ్ లో ఉన్నట్టే అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news