Movies"వాడు ఓ బద్మాష్ గాడు"..చరణ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

“వాడు ఓ బద్మాష్ గాడు”..చరణ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ఓ హీరోయిన్ ని మోసం చేశాడా ../ అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . స్వయాన ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఆ బ్యూటీ మరెవరో కాదు . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది .

అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ..”సభకు నమస్కారం” అంటూ తన స్పీచ్ ని తెలుగులో స్టార్ట్ చేసింది . అయితే ఇదే విషయాన్ని రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ఓ షోలో ప్రస్తావిస్తూ రామ్ చరణ్ – రానా తెగ నవ్వుకుంటారు. పక్కనే ఉన్న కీయారా అద్వాని.. దీనికి క్లారిటీ ఇస్తూ ..”నాకు తెలుగు రాదు అని.. రాంచరణ్ ఎలా చెప్తే అలా చేశాను” అని చెప్పుకొస్తుంది.

నువ్వు అలా చెప్పమన్నావా..? అంటూ రానా అడగ్గా “యస్” అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇస్తాడు రామ్ చరణ్.. ఎవరైనా సభకు నమస్కారం అంటారా..? అంటూ కాసేపు వీళ్లిద్దరి మధ్య సరదా సంభాషణ నడుస్తుంది . అయితే ఇదే క్రమంలో కీయారా అద్వాని రామ్ చరణ్ పై కోప్పడుతూ బద్మాష్ అంటూ ఫైర్ అవుతుంది. ఆఫ్కోస్ ఇది సరదాగా చేసిన కామెంట్స్ అయినా అప్పట్లో మెగా ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు . కీయారా అద్వానీని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . ప్రెసెంట్ చరణ్ – కియారా అద్వాని కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు. గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా వీళ్ళు మరోసారి తెరపై కనిపించబోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news