Newsవిజయ్ దేవరకొండ "ఫ్యామిలీ"లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్..షాక్ అయిపోతున్న ఫ్యాన్స్..ట్విస్ట్...

విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ”లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్..షాక్ అయిపోతున్న ఫ్యాన్స్..ట్విస్ట్ అద్దిపోలా..!

విజయ్ దేవరకొండ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఓ రౌడీ హీరోగా.. ఓ నాటిబాయ్ గా .. ఓ అందాల రాజకుమారుడు గా .. ఓ హ్యాండ్సం హీరోగా.. ఓ పవర్ఫుల్ మాన్ గా ఇలా రకరకాల ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు . రీసెంట్ గానే ఖుషి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. ప్రజెంట్ పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .

ఈ సినిమాలో ఆయన ఓ బిడ్డకు తండ్రిగా నటించబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది . ఈ టీజర్ లో మృణాల్ ఠాకూర్ ని ఆయనకు భార్యగా చూపించారు . కాగా మృణాల్ ఠాకూర్ ని మనకి చూపించింది ఒక్కటంటే ఒక్కటే షాట్ లోనే అయినా సరే చాలా అందంగా ఆకట్టుకునింది . అయితే మృణాల్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

గతంలో ఈ డ్రెస్ ను కీర్తి సురేష్ వేసుకునింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారీ వారి పాట సినిమాలో ఓ పాటలో భాగంగా కీర్తి సురేష్ ఈ డ్రెస్ ను వేసుకుంటుంది. సరిగ్గా అదే డ్రస్సును ఇక్కడ మృనాల్ కి వేయడం పై ఇప్పుడు జనాలు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు . హిట్ కొట్టాలని ఆ లక్ ని ఇక్కడికి తీసుకొచ్చావా ..? అంటుంటే.. కీర్తి సురేష్ వేసిన డ్రెస్ ఇప్పటికే నీ దగ్గర పదిలంగానే ఉందా..? అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news