టాలీవుడ్లో కాస్త ఆశ్చర్యకరంగా రెండు కుటుంబాలు బంధుత్వం కలుపుకుంటున్నాయి. సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్ మనవరాలకు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహతో పెళ్లి కుదిరినట్టు తెలుస్తోంది. రెండు కుటుంబాలకు కావలసిన అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఆస్తులు అంతస్తులు పరంగా చూసుకుంటే మురళీమోహన్ కుటుంబం ఎక్కడో ఉంది. మురళీమోహన్ ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం కోట్లకు పడగలెత్తేసింది.
మురళీమోహన్ కు కుమార్తెతో పాటు ఏకైక కుమారుడు ఉన్నారు. అతడి పేరు రామ్మోహన్.. అతడి భార్య మాగంటి రూపా దేవి. వాళ్ళది కూడా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం. రూపాదేవిది కృష్ణాజిల్లాలోని గుడివాడ తాలూకా.. ఆమె గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు రూపా దేవి కుటుంబంతో పాటు ఇటు మురళీమోహన్ సినిమాల్లోనూ.. ఇటు రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారంలో సంపాదించిన ఆస్తులు ఇప్పుడు ఉన్న మార్కెట్ లెక్కల ప్రకారం 5 వేల కోట్లకు పైనే ఉంటాయని సమాచారం.
పైగా మురళీమోహన్ కు ఒక్క గాన ఒక్క కొడుకు ఆ ఒక్క కొడుకుకు ఏకైక కుమార్తె రాగా. ఆమె ఇటీవల అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని మురళీమోహన్ కుటుంబానికి చెందిన వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే భవిష్యత్తులో ఐదు వేల కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న మురళీమోహన్ కుటుంబానికి మాగంటి రాగా ఏకైక వారసురాలుగా ఉండబోతోంది. ఇప్పుడు ఆమెకు కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కు వివాహం కుదిరినట్టు వార్త బయటకు రాగానే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ ఇప్పటికే బాల్ సాగే – ఉస్తాద్ – మత్తు వదలరా సినిమాలతో హీరోగా తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటాడు అన్న పేరు అయితే ఉంది. ఇటు రాజమౌళి సినిమాలకు కూడా పనిచేస్తూ ఉంటాడు. పరిచయం ఎక్కడ కుదిరిందో కానీ మాగంటి రాగా శ్రీ సింహాని ఇష్టపడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువైపులా పెద్దలు కూడా వీరికి పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరి ఇది ప్రేమ వివాహమా ? లేదా పూర్తిగా పెద్దలు కుదిరిచిన వివాహమా ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. వచ్చేయేడాది వీరు పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న మురళీమోహన్ కుటుంబం కాస్త వైవిధ్యంగా ఆలోచించి.. సినీరంగంలో మంచి స్థానంలో ఉన్న కీరవాణి కుటుంబంతో బంధుత్వం కలుపుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.