కోలీవుడ్‌లో అందమైన కపుల్స్ అంటే వెంటనే చెప్పే పేరు సూర్య – జ్యోతికలదే. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్యోతిక స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో సూర్యకి అంతగా గుర్తింపు లేదు. కానీ అవన్నీ పట్టించుకోకుండా సూర్యుని ప్రేమించి జ్యోతిక పెళ్లి చేసుకున్నారు. అయితే సూర్యని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనలో ఎలా వచ్చిందో ? జ్యోతిక తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
తాజాగా జ్యోతిక తన 45వ పుట్టినరోజు జరుపుకున్నారు. వారి మధ్య ప్రేమ పెళ్లి అని కూడా నెల రోజుల్లో జరిగిపోయినట్టు జ్యోతిగా సంచలన విషయం బయట పెట్టారు. కనుక సూర్య ఇచ్చే గౌరవం వల్లే తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో తామిద్దరం కలిసిన నటించామని ఆ సమయంలోనే తమ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని జ్యోతిక తెలిపారు.
అలా తన ఇద్దరం కలిసి ఏడు సినిమాలలో నటించామని జ్యోతిక తెలిపారు. అలా తామిద్దరం కలిసి ఏడు సినిమాల్లో నటించామని.. సినిమాల్లో భాగంగా రొమాంటిక్ సీన్లు ఉన్న సమయంలో డైరెక్టర్ సూచన మేరకు మాత్రమే పరిమితమై సూర్య నటిస్తాడు.. దానిని ఏమాత్రం అదునగా తీసుకోడు.. అలా మహిళల పట్ల ఆయన ఇచ్చే గౌరవమే తనను తాను ఎక్కువగా ప్రేమించడానికి కారణమైందని జ్యోతిక పేర్కొన్నారు. సూర్యని పెళ్లి చేసుకునే సమయానికి తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేళ్లు దాటిపోయిందని తెలిపారు.
తమ ప్రేమ విషయంలో సూర్య ముందుగా తనకు ప్రపోజ్ చేశాడని.. సూర్య గురించి ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వారు కూడా తమ పెళ్ళికి అంగీకరించారని చెప్పారు. అలా తన ఇద్దరు ఒకటైనట్టు జ్యోతిక వివరించారు. ఒక తండ్రిగా సూర్య చాలా సిన్సియర్‌గా ఉంటాడు.. భర్తగా సిన్సియర్‌గా ఉండటమే కాకుండా నాకు సరైన గౌరవం ఇస్తాడు.. దీంతో సూర్యని చూసిన వారందరూ అతడిని చూసి నేర్చుకోమని తమ భర్తలకు చాలామంది మహిళలు ప్రత్యక్షంగా చెప్పటం తాను చూసానని జ్యోతిక తెలిపారు.