ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అతిలోకసుందరి ముద్దుల కూతురు జాన్వి కపూర్ తెలుగు హీరో సినిమాను రిజెక్ట్ చేసిందా ..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. దేవర సినిమాతో తెలుగులో డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వి కపూర్.. అంతకుముందే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించాల్సి ఉండింది.
అయితే బోనీ కపూర్ ఈ సినిమాను వద్దు అని చెప్పడంతో రిజెక్ట్ చేసేసింది . జాన్వి కపూర్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేయబోతుంది. ఇలాంటి క్రమంలోనే మరికొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి . అయితే జాన్వి కపూర్ మాత్రం ఎన్టీఆర్ లాంటి స్థాయి ఉన్న హీరోతోనే నటించడానికి ఇష్టపడుతుంది . అయితే అంత పెద్ద హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు .
రీసెంట్ గా యంగ్ హీరో సినిమాలో జాన్వికపూర్ కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది . పెద్ద హీరో కాదు కానీ నార్మల్ హీరో . ఆయన చేసిన ప్రతి సినిమా ఆవరేజ్ గా నిలుస్తుంది . నటన పరంగా సూపర్ . ఈ హీరో సినిమాలో అవకాశమొస్తే జాన్వి కపూర్ రిజెక్ట్ చేసిందట . దానికి కారణం ఆ హీరోకి పెద్దగా పేరు పలుకుబడి లేకపోవడమే. జనాలలో మంచి నటుడు అని పేరు సంపాదించుకున్న ఈ హీరో కి ఎన్టీఆర్ – చరణ్ – మహేష్ బాబు అంత స్టేటస్ లేదు . ఆ కారణంగానే జాన్వికపూర్ రిజెక్ట్ చేసింది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీంతో తెలుగు ఫ్యాంద్ ఆమెపై మండిపడుతున్నారు..!!