Newsశ్రీలీల డాక్ట‌ర్ ల‌క్ష్యం వెన‌క గుండెలు పిండేసే స్టోరీ ఉందా..!

శ్రీలీల డాక్ట‌ర్ ల‌క్ష్యం వెన‌క గుండెలు పిండేసే స్టోరీ ఉందా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు ? అందరూ మాట్లాడుకునే పేరు శ్రీలీల. తనదైన అందం.. అభినయంతో ఆమె దూసుకుపోతోంది. మొదటి సినిమా పెళ్లి సందడి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన శ్రీలీలకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత రవితేజ ధమాకాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో డజనుకు పైగా తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి ఈ నెల 19 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ తేజ్ ఆదికేశవ్ – మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలకు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాలయ్య భగవంత్ కేసరి – మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో శ్రీలీల ప‌లు ఆసక్తికర విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. తాను చిన్నప్పుడు భరతనాట్యం మాత్రమే చేసేదానిని.. నటనపై అవగాహన లేదు.. భరతనాట్యం చేస్తున్నప్పుడే డైలుగులు లేకుండా కథ చెప్పాలి.. డైలాగులు లేకుండా కథ చెప్పటం చాలా కష్టం.. భరతనాట్యం అనుభవం ఉండటం వల్ల నాకు నటన కష్టంగా అనిపించలేదని తెలిపింది.

ఇక తాను డాక్టర్ కావాలనే నిర్ణయం వెనక మనసును హత్తుకుని ఓ నిర్ణయం ఉందని కూడా శ్రీలీల చెప్పింది. ఒకసారి శ్రీలీల అమ్మమ్మ ఇంటికి వెళ్లిందట. శ్రీలీల కుటుంబంలో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టర్లే. శ్రీలల అమ్మమ్మ వాళ్లది మారుమల గ్రామం. ఒకరోజు అమ్మమ్మ హఠాత్తుగా కింద పడిపోవడంతో ఏం చేయాలో తెలియలేదు.. వెంటనే అన్నయ్య వచ్చి అమ్మమ్మను లేపి వైద్యం చేశాడు.. దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడిందని తెలిపింది.

అన్నయ్య మెడిసిన్ చదువుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో చేయాల్సిన పనిచేసి అమ్మమ్మను రక్షించాడు.. నాకు సహాయం చేయాలని అనిపిస్తుంది.. కానీ ఎలా చేయాలో తెలియలేదు ? ఆ రోజే తాను ఎప్పటికైనా డాక్టర్ కావాలని ఫిక్స్ అయ్యాను.. అందుకే మెడిసిన్ కోర్స్ తీసుకున్నాను.. ఇప్పుడు షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నా రాత్రిపూట చదువుకుంటున్నాను అని తెలిపింది శ్రీలీల‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news