కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎవరైనా దూసుకుపోతూ ఉంటారు.. వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. అదే కాలం ఒక్కసారి తిరగబడితే ఎంతటి గొప్ప వాళ్ళు అయినా కాలం ముందు తలవంచక తప్పదు. ఇప్పుడు ఇదే సూత్రం ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంతకు కూడా వర్తిస్తుంది. సమంత ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె కాల్ షీట్ల కోసం స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు కూడా క్యూలై ఉండేవారు.
ఎప్పుడు అయితే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందో అప్పటినుంచే సమంత కెరీర్ గ్రాఫ్ బాగా డౌన్ అవుతూ వచ్చింది. ఆమె విడాకుల తర్వాత చేసిన యశోద బిలో యావరేజ్.. శాకుంతలం అతిపెద్ద డిజాస్టర్.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఆమెపై కావాల్సినంత నెగిటివిటీ తెచ్చి పెట్టింది. చివరకు విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరో పక్కన ఖుషి సినిమా చేసింది. ఖుషి హిట్ అయినా ఆ సినిమాకు సమంత పెద్ద మైనస్ అయింది. సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ఉండి ఉంటే ఖుషి కచ్చితంగా ఇంకా పెద్ద హిట్ అయ్యేదన్న ప్రచారం జరిగింది.
దీన్నిబట్టి సమంత గ్రాఫ్ ఎలా పడిపోయిందో ? తెలుస్తోంది. అయితే సమంతకు ఇప్పుడు ఆమె బెస్ట్ ఫ్రెండ్ సింగర్ చిన్మయి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఇదే చిన్మయి సమంత ద్వారా రికమెండ్ చేయించుకుని తన భర్త రాహుల్ రవీంద్రన్‌కు ఏకంగా నాగార్జున మన్మధుడు 2 సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంది ఆ సినిమా అతిపెద్ద డిజాస్టర్ కేవలం సమంత రికమండే చేయడం వల్లే నాగార్జున ఈ సినిమా చేసి తన పరువు మొత్తం పోగొట్టుకున్నాడు.
అయితే ఇప్పుడు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం రాహుల్ కావడం విశేషం. ఈ సినిమాలో ముందుగా సమంతనే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆమె మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడం ..ఆమె మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోవడంతో ఆమె ప్లేస్ లో రష్మికను తీసేసుకున్నారు. దీనిని బట్టి అయిన సన్నిహితుల దగ్గర కూడా సమంత అంటే పెద్ద విలువ లేదన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది.