సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాము.. తెరపై నటిస్తున్నాము అంటే .. కొన్ని కొన్ని వదిలేసుకోవాలి .. మరీ ముఖ్యంగా సిగ్గుపడితే ఏ సీన్స్ లో నటించలేము . ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమాలో నటిస్తున్నారు .. అంటే కొన్ని సీన్స్ ఖచ్చితంగా చేయగలగాలి . అయితే కొంతమంది హీరోస్ అవి సునాయాసంగా చేయగలిగితే .. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి అలాంటి సీన్స్ చేయడానికి నేర్చుకుంటారు.
అదే లిస్టులోకి వస్తాడు అక్కినేని నాగార్జున . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన నాగార్జున .. మొదటగా రొమాంటిక్ సీన్స్ లో నటించమంటే చాలా ఇబ్బంది పడే వారట . ఆ తర్వాత రొమాంటిక్ సీన్స్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా అనే స్థాయికి ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే ఓ సీన్లో నిజంగానే టెంప్ట్ అయిపోయి హీరోయిన్ ని కొరికేశాడు అన్న వార్త మరోసారి వైరల్ గా మారింది.
నాగార్జున టబు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది . వీళ్ళ కెమిస్ట్రీ అదుర్స్ అని చాలామంది జనాలకి తెలుసు . వీళ్ళ కాంబోలో వచ్చిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ నిన్నే పెళ్ళాడుతా. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ సినిమాలో ఓ సీన్ లో నాగార్జున టబు ని కొరుకుతాడు. అయితే అది నిజంగానే ఆ ఫీలింగ్‌లో టెంప్ట్ అయిపోయి కొరికేశారట . దీంతో వెంటనే టబు సైతం గట్టిగా అరిచ్చేసిందట . ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు . అయితే అప్పటివరకు చాలా సైలెంట్ గా ఉన్న నాగార్జున అలాంటి సీన్స్ లో నటించడం..ఆ తర్వాతే రొమాంటిక్ హీరోగా తయారయ్యాడని ..టబు – నాగ్ ల మధ్య బంధాన్ని ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్లిపోయిందని అప్పుడు అప్పట్లో ప్రచారం జరిగింది..!!