టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్లు ఏఎన్నార్ – ఎన్టీఆర్ అంటూ అందరూ చెప్పుకుంటూ ఉంటారు . ఇప్పటికీ మన ఇండస్ట్రీలో హీరోలు 100 కోట్లు 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే ఆ ఘనత కచ్చితంగా ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ దే అని చెప్పాలి. వాళ్ళు ఒకప్పుడు కష్టపడి ఇండస్ట్రీని ఈ స్థాయిలో నిలబెట్ట బట్టే ఇప్పుడు ఈ రేంజ్ లో మన హీరోలు అనుభవిస్తున్నారు.
కాగా అప్పట్లో సోషల్ మీడియా లేదు హీరోలకి పెద్దగా పాపులారిటీ కూడా ఉండేది కాదు . నటన పరంగానే ముందుకు నెట్టుకొచ్చే వాళ్ళు . వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటకు తెలిసేవే కాదు ఈ క్రమంలోనే ఏఎన్నార్ ఓ రోజు తన భార్యను ఓ సినిమా చూడటానికి థియేటర్కు తీసుకువెళ్తే అమ్మాయి బాగుంది అంటూ ఏఎన్ఆర్ ఒక మంచి సెటప్ ను వేసుకొని సినిమా చూడడానికి వచ్చాడు అంటూ కామెంట్స్ చేశారట .
అంతేకాదు దారుణాతి దారుణంగా కూడా మాట్లాడారట . ఈ మాటలు అన్నపూర్ణమ్మ గారి చెవిన వినపడడంతో ఇంటికి వచ్చి బోరున ఏడ్చేసిందట. అంతేకాదు చచ్చిన ఇక నీతో సినిమా హాల్ కి రాను సినిమాలు చూడను అంటూ తెగేసి చెప్పిందట . నీ భార్యని నన్ను అలాంటి మాటలు అంటారా అంటూ చాలా బాధపడిపోయిందట . అన్న మాట ప్రకారమే ఆమె చనిపోయే వరకు కూడా ఏఎన్ఆర్ తో కలిసి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చూడలేదు అన్నపూర్ణమ్మ. అంత పౌరుషం గల వ్యక్తిత్వం ఆమెది అంటూ అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు..!!