Newsమ‌హేష్ ' గుంటూరు కారం ' సంక్రాంతికి రాదా... ఎస్ 100...

మ‌హేష్ ‘ గుంటూరు కారం ‘ సంక్రాంతికి రాదా… ఎస్ 100 % ప‌క్కా రాదా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెర‌కెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. కానీ వాస్తవంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే అసలు గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవుతుందా ? అంటే చాలా సందేహాలే ఉన్నాయి. ఇంకా 37 రోజుల షూటింగ్ ఉంది.. సంక్రాంతికి విడుదల ఫిక్స్ అంటున్నాయి యూనిట్ వర్గాలు.

నవంబర్లో మూడు పాటల షూటింగ్ కూడా చేయాల్సి ఉందట. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ సమాచారం ప్రకారం ఇంకా 37 రోజుల షూటింగ్ కాదు అంతకన్నా కాస్త ఎక్కువే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అక్టోబర్ అయిపోతుంది.. నవంబర్, డిసెంబర్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ నెలాఖరులోగా టాకీ పార్ట్‌ మొత్తం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. గతంలో అక్టోబర్ చివరకు టాకీ ఫినిష్ చేసి నవంబర్లో మూడు పాటలు.. డిసెంబర్లో ఒకటి, రెండు పాట‌లు షూట్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు టాకీ నవంబర్ వరకు ఉండేలా ఉంది. ఇక పాటలు అన్ని డిసెంబర్లో షూట్ చేయాలి.. జనవరిలో సినిమా విడుదల అంటే టీజర్లు, ట్రైలర్లు, పాటలు విడుదల ఇలా చాలా వ్యవహారం ఉన్నది.

ఇంకా గట్టిగా చూస్తే సినిమా రిలీజ్ కు నవంబర్, డిసెంబర్ రెండో నెలలో మాత్రమే ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వెంకటేష్ సైంధవ – విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఈ రెండు సినిమాల కోసం బయ్యర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడికి అక్కడ థియేటర్ల అగ్రిమెంట్లు మొదలుపెట్టారు. పైగా గుంటూరు కారం సినిమా సంక్రాంతికి గట్టి పోటీ మధ్యలో వస్తోంది. ఆంధ్రలో రు. 50 కోట్లు – నైజాంలో రు. 45 కోట్లు రేటు ఫిక్స్ చేశారు.

నైజాంలో ఇటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు గుంటూరు కారం సినిమాను కూడా దిల్ రాజు రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే గుంటూరు కారం నైజాం రైట్స్ కోసం దిల్ రాజు తో పాటు మైత్రి వాళ్ళు కూడా గట్టిగా పోటీపడుతున్నారు. ఇంతింత రేట్లు ఇవ్వాల‌నుకున్నా.. ఆ స్థాయిలో థియేటర్లు దక్కాలి.. లేకపోతే చివర్లో అమౌంట్ తగ్గించి కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.. ఏది ఏమైనా గుంటూరు కారం రిలీజ్ విషయంలో ఉన్న సందేహాలు అన్ని తొలగిపోవాలంటే అర్జెంటుగా ఈ సినిమా నుంచి ఏదో ఒక బలమైన కంటెంట్ బైటికి రావాలి.

దసరాలోపు పాట అనౌన్స్మెంట్ ఇస్తామని యూనిట్ చెప్పింది. దసరా మరో రోజులోకి వచ్చేసింది. అసలు ఇంకా ఈ పాటను ఎప్పుడు ? రిలీజ్ చేస్తారు.. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది రిలీజ్ ఎప్పుడు ఉంటుంది ? ఏంటన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే గుంటూరు కారం నూటికి నూరు శాతం సంక్రాంతికి వస్తుందా అంటే మహేష్ అభిమానులు చెప్పలేని పరిస్థితి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news