సాధారణంగా ఒక మనిషి ఇది అవ్వాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటారు . అయితే టైం బాగో లేకపోయినా.. పరిస్థితులు కలిసి రాకపోయినా.. మనం కావాలి అనుకున్నది చేయలేం మరికొన్నిసార్లు మనం ఊహించిన విధంగా మన లైఫ్ టర్న్ అయిపోతూ ఉంటుంది. అలా మనలో చాలామందికి జరిగే ఉంటుంది. ఆ లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి సినిమాలు అంటే అస్సలు ఆసక్తి లేదట . మొదటి నుంచి బాగా చదువుకొని డాక్టర్ కావాలి అని అనుకున్నారట . అంతేకాదు డాక్టర్ అయిపోతాను అంటూ చిన్నప్పుడు ఎవరు అడిగిన చెప్పుకొచ్చేవాడట ఎన్టీఆర్ . ఎన్టీఆర్ అదే విధంగా చదవడానికి కూడా ట్రై చేశాడట. కానీ తన చిన్నతనంలోనే తన తాత గారిని చూసి నటనపై ఇంట్రెస్ట్ వచ్చింది . ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రప్పించారు పెద్ద ఎన్టీఆర్ .
చిన్నతనంలోనే ముఖానికి మేకప్ వేసుకొని నటించడంతో ఎన్టీఆర్ లోని అసలు టాలెంట్ బయటపడింది. ఆయన మైండ్ లో డాక్టర్ అవ్వాలని ఉన్న ఆయన బ్లడ్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వాలని చెప్పుకొచ్చింది . అందుకే డాక్టర్ అవ్వాలనుకున్న తన కలను పక్కన పెట్టేసి ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎన్ని మంచి విజయాలు అందించాడో మనకు తెలిసిందే. అంతేకాదు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి కూడా డాక్టర్స్ అంటే ప్రత్యేకమైన గౌరవం..వాళ్లను ఎంతగానో గౌరవిస్తారు . అలా డాక్టర్ కావాల్సిన ఎన్టీఆర్ యూ టర్న్ తీసుకొని మనకోసం హీరో అయ్యాడు..!!