సమంత ఒకప్పటి వరకు ఈ పేరుకి పెద్ద పాపులారిటీ లేదు . ఏదో ఏం మాయ చేసావే సినిమాలో జెస్సి పాత్రలో కనిపించి మెప్పించింది . అయితే సమంత పేరుకు అంత పాపులారిటీ తీసుకొచ్చింది మాత్రం నాగచైతన్యనే అని చెప్పాలి. అక్కినేని ఇంటికి కోడలుగా ఆమెకు హోదాను అందించి తన పరువును ప్రతిష్టను రెండు మెట్లు ఒకేసారి ఎక్కెలా చేశాడు . అయితే ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది . విడాకులు తీసుకొని కూడా చాలా కాలం గడుస్తుంది.
ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా వీళ్లిద్దరు విడాకులకు పరోక్షంగా అమలా కూడా కారణమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . అమల సమంతకు మంచి చెడు చెప్పుంటే వీళ్ళ విషయం డివర్స్ వరకు వచ్చేది కాదు అన్నది వాళ్ళ అభిప్రాయం . అంతేకాదు సమంత ముందు నుంచి అమల పెద్దగా కేర్ చేసేది కాదట. అసలు ఆమెను కోడలు గానే ట్రీట్ చేయలేదట .
దీంతో సమంత కూడా ఆమెకి నచ్చిన పద్ధతులు ఆమె ఫాలో అయిందని .. ఒక హీరోయిన్ ఒక స్టార్ ఇంటికి కోడలు అయిన తర్వాత ఎలా ఉండాలో అమల చెప్పుంటే ఇప్పుడు అమల స్థానాన్ని సమంత తీసుకొని ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యుండేది అని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ .. సమంత చైతన్య విడాకులకు అమల ఓ కారణమైంది..!!