దర్శకు ధీరుడు రాజమౌళి ఇటీవల తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన రాజమౌళి కెరీర్లో మొత్తం 12 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలుపెట్టి ఇటీవల వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ సినిమా వరకు అన్ని సూపర్ డూపర్ హిట్లు. బాహుబలి 1,2 టు ఆర్ ఆర్ సినిమాలతో రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఇతరులతో పోలిస్తే ఈ 20 ఏళ్లలో రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ. ఆయన నెంబర్ కంటే సినిమా హిట్ అవ్వడానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆర్ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. నాటు నాటు పాటుకు ఆస్కార్ సైతం దక్కించుకున్నారు. లార్జెర్ధన్ లైఫ్ పాత్రలతో మ్యాజిక్ చేయగల అసాధారణ పనితనం రాజమౌళి దగ్గర ఉంది. రెండు దశాబ్దాల కెరీర్ లో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఎంత ? అనేదానిపై చూచాయిగా కొన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి.
రాజమౌళి మొత్తం నికర ఆస్తి విలువ రు. 200 కోట్ల పైన ఉంటుందని అంచనా.. అంటే 20 మిలియన్ డాలర్లు. రాజమౌళికి రకరకాల ఆదాయ వనరులు ఉన్నాయి. ఆయనకు ప్రధాన ఆదాయం సినిమాల నుంచి వస్తోంది. వ్యక్తిగత వ్యాపారాల్లో పెట్టుబడులు సహా.. అటు తాను దర్శకత్వం వహించే సినిమాల్లో లాభాలు ఉన్నాయి. హైదరాబాద్ మణికొండ సమీపంలో రాజమౌళికి విలాసవంతమైన బంగ్లా ఉంది. 2008లో దీనిని కొనుగోలు చేశారు.
హైదరాబాదులో ఇంటితో పాటు ఔటర్ లో ఫామ్ హౌస్ కొన్ని స్థలాలు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఇతర నగరాల్లో కూడా రాజమౌళి అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఖరీదైన కార్లు రాజమౌళి గ్యారేజీలో ఉన్నాయి. రేంజ్ రోవర్ – బీఎండబ్ల్యూ సహా కొన్ని విలాసవంతమైన కార్లు ఆయన సొంతం. ఇవి కాక రాజమౌళికి తండ్రి నుంచి రావాల్సిన ఉమ్మడి ఆస్తులు కూడా కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ స్థిర, చరాస్తులు కలుపుకుంటే రాజమౌళి ఆస్తులు ఇంకా ఎక్కువే ఉంటాయని అంటున్నారు.