కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ భారీగా నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా దసరా కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు కాగా లియో సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
లియో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు తొలి రోజు వరల్డ్ వైడ్ గా రు. 148.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది. విచిత్రం ఏంటంటే తెలుగు వెర్షన్ లో కూడా ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రు. 16 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండో రోజు కూడా లియో పలుచోట్ల బాగానే కలెక్షన్లు అందుకుంటున్నట్టు ట్రేడ్ రిపోర్ట్ లు చెబుతున్నాయి.
విచిత్రం ఏంటంటే అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు రు. 32 కోట్ల గ్రాస్ వచ్చింది. బాలయ్య సినిమాపై ఉన్న అంచనాలు.. హైప్‌తో పోలిస్తే ఇవి కాస్త తక్కువ వసూళ్లే అని చెప్పాలి.
అయితే బాలయ్య సినిమా కూడా రెండో రోజు నుంచి అనూహ్యంగా పుంజుకుంటుంది. ఏది ఏమైనా లియో నిజంగా సెన్సేషనల్ వసూళ్లు సాధించిందని చెప్పాలి. అటు బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా మంచి అంచనాలతో వచ్చినా.. లియో ఆ సినిమా నుంచి పోటీ తట్టుకుని కూడా అదిరిపోయే వసూళ్లు సొంతం చేసుకుంది.