Movies"ఇకనైన నోర్లు మూయండ్రా".. సినిమా పేరు మర్చిపోయిన పవన్ కళ్యాణ్ పై...

“ఇకనైన నోర్లు మూయండ్రా”.. సినిమా పేరు మర్చిపోయిన పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్..అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన హారిష్ శంకర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ ఎంత పెరిగిందో తెలియదు కానీ నెగెటివిటీ ట్రోలింగ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. ఓ సెలబ్రిటీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏదో ఒక విషయం కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూనే ఉన్నారు . మరీ ముఖ్యంగా టాప్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం.

కాగా రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వేదికపై మాట్లాడుతూ తన సొంత సినిమా టైటిల్ను మర్చిపోయి వేరే ఏదో టైటిల్ పలికాడు . దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . ఒక్క సినిమా పేరు మర్చిపోయిన దానికి ఎంత హంగామా చేస్తున్నారో పవన్ హేటర్స్ మనం గమనిస్తూనే ఉన్నాం.

అయితే ఓపికగా చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఫైనల్లీ అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు. “సొంత పేరు మూవీ టైటిల్ చెప్పిన ఇంత వైరల్ అయ్యేది కాదేమో ..అంతా మనమంచికే “అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హేటర్స్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మనిషి అన్నాక పొరపాట్లు చేయడం సహజం .. మరీ పవన్ కళ్యాణ్ పై ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు ఏంటి ..? అంటూ సామాన్య జనాలు కూడా ఫైర్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news