News' గుంటూరు కారం ' ... అస‌లే గొడ‌వ‌లు... త్రివిక్ర‌మ్‌కు టార్గెట్...

‘ గుంటూరు కారం ‘ … అస‌లే గొడ‌వ‌లు… త్రివిక్ర‌మ్‌కు టార్గెట్ పెట్టిన మ‌హేష్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 2024న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి త్రివిక్రమ్.. మహేష్ మధ్య అంత సఖ్యత వాతావరణం అయితే లేదన్నది వాస్తవం. మహేష్ బాబు ఇష్టం లేకపోయినా మ్యూజిక్ డైరెక్టర్గా తమన్‌ను త్రివిక్రమ్ కొనసాగిస్తున్నాడు.

ముందు ఈ సినిమాకు ఎంపికైన పూజా హెగ్డే హీరోయిన్గా ఉండటం కూడా మహేష్ కు ఇష్టం లేదు. త్రివిక్రమ్ బలవంతం మీద కొనసాగించినా డేట్లు సర్దుబాటు కాక పూజ హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. తొలి రెండు షెడ్యూల్స్ అవుట్ ఫుట్ కూడా మహేష్ బాబుకు ఏమాత్రం నచ్చలేదు. చాలా డిస్కషన్లు న‌డిచాయి. క‌థ‌లో కొన్ని మార్పులు, చేర్పులు జ‌రిగాయి.

అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్‌కు మ‌హేష్ పెద్ద టార్గెట్టే పెట్టిన‌ట్టు తెలుస్తోంది. నవంబర్ నాలుగో వారం నాటికి ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తిగా ఫినిష్ చేసేయాలని నిర్మాత‌ల వైపు నుంచి మ‌హేష్ త్రివిక్ర‌మ్‌కు కండీష‌న్లు పెట్టించిన‌ట్టు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం న‌డుస్తోంది. అందుకే త్రివిక్ర‌మ్ కూడా ప‌క్కా ప్లాన్స్‌తో భారీ షెడ్యూల్స్ వేసుకుంటున్నాడ‌ట‌.

డిసెంబ‌ర్ మూడో వారం నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైతం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా హీరో, ద‌ర్శ‌కుడి మ‌ధ్య అంతంత మాత్రం స‌ఖ్య‌త‌తోనే ఈ సినిమా లాగించేస్తున్న‌ట్టుగా ఉంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో ఉండ‌నే ఉంది. ఇక ఈ సినిమా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఉంటుంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news