నందమూరి బాలకృష్ణ ఈ యాడాది సంక్రాంతి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అప్పటికే అఖండ లాంటి సూపర్ హిట్ తో ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్యకు మళ్ళి మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సినిమాతో వరుసగా రెండో హిట్ కూడా ఇచ్చారు. ఇక ఈ యేడాదిలోనే వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య ఈరోజు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
వరుస సూపర్ డూపర్ హిట్లర్ ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అటు ప్రేక్షకుల నుంచి.. ఇటు సినీ ప్రేమికుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా ఈరోజు చూసిన వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాపై అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. బ్లాక్బస్టర్ భగవంత్ కేసరి బాలయ్య గారు.. ఫైర్‌లా నటించారు.. ప్రతిఫ్రేమ్ నన్ను ఎంతో ఆకట్టుకుంది అని తెలిపారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్… ఇంపార్టెంట్ రోల్లో నటించిన శ్రీలీల నటనపై అనిల్ రావిపూడి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బాలయ్యను ఢీకొట్టే విలన్ గా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా డే వన్ భారీగా వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.