సినిమా వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవటం.. విడాకులు ఇచ్చేయడం.. మళ్ళీ ప్రేమలో పడటం.. చాలా సహజంగా నడుస్తూ ఉంటుంది. ఇక సినిమా సెలబ్రిటీలకు రెండు పెళ్లిళ్లు కూడా కామన్ అయిపోయాయి. అసలు తెలుగులో స్టార్ హీరోలు అయితే మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్న వాళ్లు ఉన్నారు. టాలీవుడ్ లో కొంతమంది హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా రెండు పెళ్ళిళ్ళు అంతకు మించి చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్:
నందమూరి తారకరామారావు 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 11 మంది సంతానం. 1985లో బసవతారకం అనారోగ్యం కారణంగా మరణించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి.
కృష్ణంరాజు:
రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆయన ఏపీలోని తునికి చెందిన శ్యామల దేవిని రెండవ వివాహం చేసుకున్నారు.
కమల్‌హాసన్:
కమలహాసన్ ఇద్దరిని పెళ్లాడడంతో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు. ముందు కమలహాసన్ వాణిగణపతిని వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్, అక్షర హాసన్ జన్మించారు. ఆ తర్వాత కమల్ మరో సీనియర్ హీరోయిన్ గౌతమితో సహజీవనం చేసి.. ఇప్పుడు ఆమెతో కూడా దూరంగా ఉంటున్నాడు.
నాగార్జున :
టాలీవుడ్ కింగ్ నాగార్జున ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఏకైక కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు యంగ్ హీరో నాగచైతన్య పుట్టాక మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు.
శరత్‌బాబు :
సీనియర్ హీరో శరత్ బాబు మొదటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. చాలా ఏళ్లపాటు కలిసి ఉన్నాక వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయారు. అనంతరం స్నేహలతను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత స్నేహలతకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టును వివాహం చేసుకున్నారు.
ప్రకాష్‌రాజ్:
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారుని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. అనంతరం ప్రకాష్ రాజ్ బాలీవుడ్ డ్యాన్సర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిగా వైజాగ్‌కు చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే జరిగిన పెళ్లి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2005లో రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలానికి పవన్ రేణుకు కూడా విడాకులు ఇచ్చి తీన్మార్ సినిమాలో నటించిన రష్యా నటి అన్నాలెజినోవాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు.