నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో నాలుగు రోజుల టైం మాత్రమే ఉంది. అఖండ – వీర సింహారెడ్డి లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ రాగా.. ఈ సినిమా టోటల్ రంగ్ టైమ్ 155 నిమిషాల పాటు ఉంది. ఈ సినిమాకు ఇది డీసెంట్ రన్ టైం అని చెప్పాలి.
ఇక ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే గతంలో ఏ సినిమాకు జరగనంతగా రు. 110 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటువైపు విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీలో ఉన్నా కూడా ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగటం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమా కోసం నందమూరి, తెలుగు సినిమా అభిమానులే కాకుండా సినీప్రియులు అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోని ఫేమస్ క్రిటిక్ ఉమైర్ సంధు భగవంత్ కేసరి మూవీ చూశారు. తన రివ్యూలతో ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసే ఉమెర్ ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగ్ పూర్తయింది.. 2023 సంవత్సరం నందమూరి బాలకృష్ణది అని పేర్కొన్నారు.
బాలయ్య నట విశ్వరూపమే చూపించారన్నట్టుగా క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా అదిరిపోయిందని చెప్పడంతో నందమూరి అభిమానులు అయితే ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఏది ఏమైనా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవటం కాయంగా కనిపిస్తోంది.