Movies"దండం పెడతాం శ్రీలీల దయచేసి అలా చేయకు ప్లీజ్"..ఫ్యాన్స్ ఓపెన్ రిక్వెస్ట్..!

“దండం పెడతాం శ్రీలీల దయచేసి అలా చేయకు ప్లీజ్”..ఫ్యాన్స్ ఓపెన్ రిక్వెస్ట్..!

శ్రీ లీల.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రీగిపోతుంది . నిన్న మొన్నటి వరకు శ్రీ లీల కేవలం గ్లామర్స్ పాత్రలో మాత్రమే కనిపించగలదు అంటూ చాలామంది జనాలు చెప్పుకొచ్చారు . అయితే అవంతా తప్పు అంటూ ఒక్క సినిమాతో ప్రూవ్ చేసేసింది ఈ కన్నడ బ్యూటీ . భగవంత్ కేసరి సినిమాలో తనదైన స్టైల్ లో నటించి సెంటిమెంటల్ పాత్రతో అభిమానుల మనసులను దోచుకునింది శ్రీలీల .

ఈ సినిమాలో శ్రీ లీల యాక్షన్ సీన్స్ తో పాటు చాలా ఎమోషనల్ సీన్స్ లో నటించి అభిమానుల చేత కంటతడి పెట్టించింది .ఈ క్రమంలోని సోషల్ మీడియాలో శ్రీలీలకు ఫ్యాన్స్ కొత్త సజెషన్స్ ఇస్తున్నారు . ఇకపై నువ్వు గ్లామరస్ పాత్రలపై ఎంత ఫోకస్ చేస్తావో అదేవిధంగా సెంటిమెంట్ పాత్రలపై ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు అందరి హీరోయిన్స్ డబ్బు కోసం కక్కుర్తి పడి చెత్త రోల్స్ చేయొద్దు శ్రీలీల నీకు మంచి టాలెంట్ ఉంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి భగవంత్ కేసరి సినిమా తో శ్రీలీల తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని బాగానే పెంచేసుకుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి రోల్స్ చూస్ చేసుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news