సినిమా ఇండస్ట్రీలో మనం ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి. అలాంటి మాయలకు ఎంతో మంది హీరోలు బలైపోతూ ఉంటారు ..ఆ లిస్టులోకే వస్తాడు మన ఎన్టీఆర్ . చాలా టాలెంటెడ్ .. చాలా ఓపిక ..సహనం ఉన్న ఎన్టీఆర్ సినిమా హిట్ ఫట్ విషయాలను పెద్దగా పట్టించుకోడు . మనం సినిమా లో నటించం.. అది హిట్టా పట్టా అని పక్కన పెడితే అభిమానులను ఎంటర్టైన్ చేసామా..? లేదా..? అన్నది ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొస్తూ ఉంటారు.
అయితే ఎన్టీఆర్ ఎంతో హిట్ అవుతుందని ఆశపడి ఎంతో కష్టపడి నటించినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . అది కూడా ఓ హీరోయిన్ కారణంగా దీంతో ..ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.. కానీ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే మరి ఎందుకు ఫ్లాప్ అయింది అని చెప్పుకునే సినిమా మాత్రం ఊసరవెల్లి .
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . కధ – కంటెంట్ నటన విషయంగా ఎన్టీఆర్ సూపర్ గా నటించాడు .. అయినా సరే ఈ సినిమా ఫ్లాప్ అయింది . అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం హీరోయిన్ తమన్నా అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . ఈ సినిమాలో ఆమె కూసింత ఓవర్ యాక్టింగ్ ఎక్కువగా చేసిందని ఆ కారణంగానే ఫ్యాన్స్ భరించలేకపోయారని ..దానితో ఎన్టీఆర్ నటన బాగున్న తమన్న నటన మైనస్ గా మారి ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ చెప్పుకొచ్చారు . ఇలా మంచి సినిమా ఎన్టీఆర్ చేతుల్లో పడ్డ ప్రయోజనం లేకుండా పోయింది..!!